ఒకరిని స్కూటీతో ఢీకొట్టి, మరొకరిని గాల్లోకి ఎగిరేసి తన్నిన పశువులు..!

ఓ ఎద్దు ఎదురొచ్చిన వారిని గుద్దుకుంటూ వెళ్లి ఆగమాగం చేసింది.రోడ్డులో ముందు నుంచి స్కూటీపై వస్తున్న ఓ అమ్మాయిని ఢీకొట్టింది.

ఇలాంటి ఘటనే మరో వ్యక్తిని గాల్లోకి ఎగిరేలా గిత్తలతో కొట్టేంది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

గుజరాత్ నవ్ సరిలో బైక్ పై వెళ్తున్న మహిళపై ఓ ఎద్దు దాడి చేసింది.

మహిళ వెళ్తుండగా అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఎద్దు.ఆమెను ఢీకొట్టింది.

దీంతో మహిళ కింద పడగా స్వల్ప గాయాలు అయ్యాయి.దీనిపై ఎద్దు యజమానికి ఫిర్యాదు చేయగా అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.

దీంతో అతడిపై పోలీసు కేసు పెట్టింది ఆ మహిళ.మరో ఘటనలో రోడ్డు దాటుతున్న యువకుడిని ఓ ఎద్దు కొమ్ములతో పొడిచింది.

ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బాగ్ పత్ లో జరిగింది.అనంతరం యువకుడు పక్కకు వెళ్లి కూర్చోగా.

కుటుంబ సభ్యులు వచ్చి ఆస్పత్రికి తరలించారు.రోడ్డుపైకి వచ్చిన ఆవులు, గేదెలు ఇలా ప్రమాదాలు జరిగేలా చేస్తున్న ఎవరూ పట్టించుకోకపోవడం చాలా బాధకరం అని ప్రయాణికులు చెబుతున్నారు.

రోడ్లపై వెళ్లాలంటేనే భయం వేస్తోందని వివరిస్తున్నారు.అంతే కాకుండా చిన్న పిల్లలను బయటకు పంపించాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నాం అని.

చిన్న పిల్లలైనా, పెద్ద వాళ్లైన పశువుల దాడిక తట్టుకోలేరని వాపోతున్నారు.ఏమైనా జరిగి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.