శరీరంలో క్యాల్షియం లెవల్స్ పెంచే ఆహారాలు

మన శరీరంలో ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియం తప్పనిసరి.ఒకవేళ శరీరంలో క్యాల్షియం తక్కువైతే ఎముకలు బలహీనం అయ్యి కీళ్లనొప్పులు వంటివి విపరీతంగా బాధిస్తాయి.

అంతేకాక క్యాల్షియం లోపం కారణంగా దంతక్షయం,గుండెకు సంబందించిన సమస్యలు , మజిల్ క్రాంప్స్, ఆకలి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి.

అంతేకాక మన శరీరంలో కండరాల ఏర్పాటుకు, హార్మోన్ల ఉత్పత్తికి, రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి , కండరాల ఏర్పాటుకు క్యాల్షియం చాలా అవసరం.

అందువల్ల మన శరీరంలో క్యాల్షియం లెవల్స్ బాగా ఉండేలా చూసుకోవాలి.క్యాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకుంటే మన శరీరానికి అవసరమైన క్యాల్షియం అందుతుంది.

ఇప్పుడు ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.ఆకుపచ్చని కూరగాయల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.

బ్రోకలీలో ఎక్కువగా క్యాల్షియం ఉంటుంది.అందువల్ల ఆహారంలో ఆకుపచ్చని కూరగాయలను భాగంగా చేసుకోవాలి.

పాలలో అత్యధికంగా క్యాల్షియం ఉంటుంది.కాబట్టి ప్రతి రోజు కనీసం ఒక గ్లాస్ పాలను త్రాగటం అలవాటు చేసుకోవాలి.

పాలలో ఏదైనా ప్రోటీన్ పొడి మిక్స్ చేసుకొని త్రాగితే మంచిది.సొయా పాలలో కూడా క్యాల్షియం సమృద్ధిగానే ఉంటుంది.

ప్రతి రోజు త్రాగితే శరీరానికి అవసరమైన క్యాల్షియం అందుతుంది.అయితే ఆవుపాలతో పోలిస్తే మాత్రం కాస్త తక్కువగా ఉంటుందని చెప్పాలి.

బాదంలో క్యాల్షియంతో పాటు విటమిన్ E కూడా సమృద్ధిగా ఉంటుంది.అందువల్ల ప్రతి రోజు బాదం పప్పులను తినటం అలవాటు చేసుకోవాలి.

అన్ని డ్రై ఫ్రూట్స్ కన్నా బాదంలోనే క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి తోపాటు క్యాల్షియం కూడా సమృద్ధిగా ఉంటుంది.

అంతేకాక యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి.అందువల్ల ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ ప్రతి రోజు త్రాగితే మంచిది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి14, మంగళవారం2025