'బాబు పబ్లిసిటీ'.. పై కాగ్ రిపోర్ట్ తెలిస్తే...నోళ్ళు వెళ్ళ బెడుతారు..!!
TeluguStop.com
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల సొమ్ముతో పబ్లిసిటీ చేసుకోవడంలో మహా దిట్ట అయితే ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఏపీ ప్రజలకి ఎంతో స్పష్టంగా తెలిసిందే.అయితే ఇదే విషయాన్ని కాగ్ సైతం తన నివేదికలో వెల్లడించింది.
చంద్రబాబు ఏ కార్యక్రమానికి ఎంత ఖర్చు చేశారు.ఎలా ప్రజా ధనాన్ని ప్రచారానికి వాడుకున్నారు అనేది లెక్కలు కట్టి మరీ వివరించింది.
దాంతో ఇంతవరకూ ప్రచారం కోసం ఎంత ఖర్చు అవుతుందో తెలియని వారికి దిమ్మతిరిగే షాక్ తగిలినట్టు అయ్యింది.
ఇంతకీ కాగ్ తన నివేదికలో ఏమని ఇచ్చిందంటే. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
చంద్రబాబు ఈ మధ్యకాలంలో ప్రభుత్వ సొమ్ముతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఒక పక్క ధర్మ పోరాట దీక్షలు, మరో పక్క , నవ నిర్మాణ దీక్షలు ఇలా ప్రజల సొమ్ముని మంచి నీళ్ళుగా ఖర్చు చేస్తున్నారు.
సభలకోసం ఏర్పాట్లు చేయడం .జనాలని తరలించడం , వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం, ఇవన్నీ భారీ స్థాయిలో యాడ్స్ వసూలు చేసే పత్రికలకు యాడ్స్.
ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్నీ భారే స్థాయిలో ఉండే ఖర్చులే.
ఈ పరిణామాల నేపధ్యంలోనే కాగ్ ఈ విషయాలని స్పష్టంగా ప్రకటించింది.చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా చేసిన నిరాహార దీక్ష ఖర్చు ఇరవై కోట్ల రూపాయల పైనే ఉందని గతంలో వార్తలు వచ్చాయి.
అందుకుగాను జనాలని తరలించడం , వారికి సదుపాయాలూ చేయడం అందరికి తెలిసిందే అయితే ఆ కార్యక్రం రోజుకి బాబు ప్రభుత్వం పేపర్ లో యాడ్స్ కి చేసిన ఖర్చు అక్షరాల రెండు కోట్ల రూపాయల వరకూ ఉందని కాగ్ తెలిపింది.
ఇకపోతే అంబేద్కర్ ఆశయం, చంద్రన్న ఆదరణ, అంటూ చేపట్టిన మరో ప్రోగ్రామ్ కోసం బాబు ఫొటోలతో ఇచ్చిన యాడ్స్ విలువ అక్షరాలా మూడు కోట్ల రూపాయలని కాగ్ వివరించింది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
నవ నిర్మాణ దీక్ష కి గాను బాబు చేపట్టిన యాడ్స్ కి గాను నాలుగు కోట్ల రూపాయల పైనే తన నివేదికలో తెలిపింది.
ధర్మపోరాట దీక్షకు సంబంధించి యాడ్స్ ఖర్చు మరో మూడు కోట్ల రూపాయల పైనే ఉందట.
అయితే ప్రభుత్వం తరుపున చేయాల్సిన యాడ్స్ ని పరిధిలోకి తీసుకోకుండా , తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి బాబు ఖర్చు చేసింది మాత్రమే కాగ్ వేరు చెసీ ప్రకటించింది.
అయితే ప్రజా ధనాన్ని బాబు ఎలా ఖర్చు చేస్తున్నారో తన నివేదికలో వెల్లడించిన కాగ్ నివేదిక చూస్తే ఏపీ పజలు తెల్లమొఖం వేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.
రోజుకో కప్పు కుంకుమపువ్వు టీ తాగితే ఏం అవుతుందో తెలుసా..?