ప్రమాదకరంగా మారిన కేబుల్ గుంతలు
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: మునగాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ కొరకు రోడ్లపై గుంతలు తీసి అండర్ గ్రౌండ్ ద్వారా పైప్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు.
వారి అయిపోయిన తర్వాత సదరు కాంట్రాక్టర్ తీసిన గుంతలను పూడ్చకుండా వదిలేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
ప్రధాన రహదారుల వెంట ఈ గుంతలు తీయడంతో ప్రమాదాలకు ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వారికి నరకం కనిపిస్తుంది.
పొరపాటున ఆ గుంతల్లో పడితే ఇక అంతే సంగతి.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుంతలను వెంటనే పూడ్చి వేసేలా సదరు కాంట్రాక్టర్ చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
సుజీత్ నెక్స్ట్ సినిమాకి హీరో దొరికేశాడా..?