తినే భోజనంలో పాము తల, అయ్య బాబోయ్.. ఎక్కడో తెలుసా?

ఓ వ్యక్తికి విపరీతమైన ఆకలి వేసింది.అతడు విమానంలో ఉన్నాడు.

అయితే ఏంటి అధే విషయాన్ని ఎయిర్ హోస్టెస్ తో చెప్పి బోజనం తెప్పించుకున్నాడు.

అవురావురుమంటూ తనిడం ప్రారంభించాడు.కానీవాటి మధ్యలో కనిపించిన ఓ దృశ్యాన్ని చూసి వాంతి చేసుకున్నాడు.

అంతేనా కేకలు పెట్టి అరుస్తూ ప్లేట్ ని పడేసి మరీ పరుగులు పెట్టడం ప్రారంబించాడు.

ఏమైందా అని అందరూ ప్రశ్నించగా విషయం చెప్పాడు.అసలు ఏం జరిగిందంటే జులై 21న టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డ్యూసెట్ డార్ఫ్ కు వెళ్తున్న సన్ ఎక్స్ ప్రెస్ విమానంలో ఓ దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది.

క్యాబిన్ సిబ్బంది భోజనం చేస్తున్నారు.అందులో ఒక అటెండెంట్ సగం భోజనం పూర్తయిన తర్వాత బంగాళ దుంపలు, కూరగాయల మధ్య తెగిపడిన పాము తలను గుర్తించాడు.

వెంటనే తిన్నదంతూ అక్కడే కక్కేశాడు.ఆ తర్వాత భయంతో కేకులు పెడ్తూ.

కూర్చున్న చోటు నుంచి పరుగులు పెట్టడం ప్రారంభించాడు.ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియోలో పుడ్ ట్రే మధ్య పాము తల స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ ఘటనపై విమానయాన సంస్థ స్పందించింది.ఈ ఘటనపై వెంటనే చర్యలు చేపట్టింది.

మరసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చేస్తామని తెలిపింది.అయితే ఈ ఘటన చూసిన వాళ్లంతా ఛీఛీ.

ఇదేం కర్మరా బాబు, తినే అన్నంలో పాములు ఏంటంటూ కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా మనం కూడా తినే అన్నంలో అలాంటి పాము వచ్చిందని ఊహించుకోవడానికి కూడా అసహ్యించుకుంటాం.

ఇండస్ట్రీలో తొక్కేశారు.. రాజకీయాలలోకి మేం రాకూడదా: యాంకర్ శ్యామల