కిడ్నీలో రాళ్లను కరిగించే క్యాబేజీ.. ఆ బెనిఫిట్స్ కూడా!
TeluguStop.com
మన శరీరంలో కిడ్నీలు ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయితే నేటి కాలంలో చాలా మంది కిడ్నీ వ్యాధులతో బాధ పడుతున్నారు.
ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువ మందిని వేధిస్తోంది.మారిన జీవన శైలి, ఆహారపు అలవాటు, విటమిన్ల లోపం, శారీరక శ్రమ లేకపోవడం, పలు రకాల మందుల వాడకం, మాంసాహారం అతిగా తీసుకోవడం ఇలా రకరకాల కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
యూరిన్ లో ఉండే యూరిక్ ఆసిడ్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం, ఆక్సాలిక్ ఆసిడ్స్ నుండి ఈ రాళ్లు తయారవుతాయి.
"""/" /
ఇవి చిన్నగా ఉంటే యూరిన్ లో నుంచి వాటికి అవే బయటకు వెళ్ళిపోతాయి.
కానీ, పెద్ద రాళ్లు అయితే మాత్రం యూరిన్ ద్వారా బయటికి రావడం కష్టం అవుతుంది.
అప్పుడే అసలు సమస్యలు తలెత్తుతాయి.ఈ రాళ్లు యూరిన్ యొక్క ఫ్లో ని అడ్డుకోవడంతో పాటుగా తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.
అయితే కిడ్నీలో రాళ్లను కరిగించడంతో కొన్ని ఆహారాలు గ్రేట్‌గా సహాయపడతాయి.అలాంటి ఆహారాల్లో క్యాబేజీ ఒకటి.
"""/" /
క్యాబేజీలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, రిబోఫ్లేవిన్, ఫోలేట్, ఫైబర్, ల్యాక్టిక్ యాసిడ్, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషల విలువలు దాగి ఉన్నాయి.
ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఉన్న వారు తరచూ క్యాబేజీ వండుకుని లేదా క్యాబేజీ ఆకుల రసం తీసుకుంటే గనుక అందులో ఉండే పలు పోషకాలు కిడ్నీలో ఉండే రాళ్ళను తొలగిస్తాయి.
అదే సమయంలో కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలోనూ క్యాబేజీ తోడ్పడుతుంది.ఇక క్యాబేజీని కిడ్నీలో రాళ్లు ఉన్న వారే కాదు అందరూ తీసుకోవాలి.
ఎందుకంటే, బరువు తగ్గించడంలోనూ, శరీర రోగ నిరోధక శక్తి పెంచడంలోనూ, మలబద్ధకం నివారించడంలోనూ, అల్జీమర్స్ వ్యాధిని దూరం చేయడంలోనూ, రక్తపోటును అదుపు చేయడంలో ఇలా చాలా విధాలుగా క్యాబేజీ ఉపయోగపడతుంది.
కాబట్టి, ఖచ్చితంగా అందరూ క్యాబేజీని డైట్‌లో చేర్చుకోండి.
చంద్రబాబు క్లారిటీతో ఉన్నారా ? అందుకే ఆ స్టేట్మెంట్ ఇచ్చారా ?