క‌రోనా టైమ్‌లో క్యాబేజీ తింటే ఏం అవుతుందో తెలుసా?

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కంటికి క‌నిపించ‌కుండా ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌ను ముప్పు తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే.

చైనాలో పురుడు పోసుకున్న ఈ ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌తి రోజు వేల మంది మృత్యువాత ప‌డుతున్నారు.

అయితే ఈ క‌రోనా నుంచి ర‌క్షించుకోవాలంటే.శ‌రీర రోగ నిరోధక‌ శ‌క్తి పెంచుకోవాలి.

అలా పెంచుకోవాలంటే పోష‌కాహారం తీసుకోవాలి.అయితే రోగ నిరోధ‌క శ‌క్తి పెంచ‌డంలో క్యాబేజీ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ఆకుకూర‌ల్లో ఒక‌టైన `క్యాబేజీ` గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.అయితే క్యాబేజీలో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది.

ఈ విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా ప‌ని చేసి.శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డేలా చేస్తుంది.

మ‌రియు క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన ప‌డ‌కుండా ర‌క్షిస్తుంది.అలాగే క్యాబేజీతో మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.మ‌ధుమేహం.

చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు.అర‌వై ఏళ్ల‌కు వ‌చ్చే ఈ మ‌ధుమేహం.

నేటి కాలంలో మారిన జీవ‌న శైలి కార‌ణంగా ఇర‌వై, ముప్పై ఏళ్ల‌కే వస్తుంది.

అయితే మ‌ధుమేహం ఉన్న వారు క్యాబేజీని డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉండేలా చేస్తుంది.

అధిక ర‌క్త‌పోటును కంట్రోల్ చేస్తుంది.అలాగే క్యాబేజీలో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది.

ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది.ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ధకం, క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ఇక‌ క్యాబేజీలో కేల‌రీలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి.కాబ‌ట్టి, బ‌రువు త‌గ్గాలి అనుకునే వారు క్యాబేజీని రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల.

క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది.దీంతో వేరే ఆహారాన్ని తీసుకోలేరు.

త‌ద్వారా అధిక బ‌రువుకు చెక్ పెట్ట‌వ‌చ్చు.అదేవిధంగా, క్యాబేజీలో వాట‌ర్ కంటెంట్ ఎక్కువ‌గా ఉంటుంది.

అందుకే క్యాబేజీ త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది.

దేవుడా, చేప నోట్లో మనిషి పళ్లు.. చూసి పరుగులు తీసిన యువతి!