అక్కడ కూల్ డ్రింక్స్, స్నాక్స్ ఫ్రీగా ఇస్తారు… ఎక్కడంటే?
TeluguStop.com
పట్టణాల్లో ట్రాఫిక్ రణగొణధ్వనుల మధ్య పయనించడం అంటే కత్తిమీద సామే.ఇలాంటి పరిస్థితులలో బస్సుపై పయనించాలంటే చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే క్యాబ్స్ రైడింగ్ బాగా క్లిక్ అయింది.ఆఫీసులకి వెళ్లేవారు, బయట షాపింగులకి వెళ్లేవారు, సినిమాలకు, షికార్లకు వెళ్లేవారు ఇపుడు ఎక్కువగా క్యాబ్( Cab ) బుక్ చేసుకోవడం మనం చూడవచ్చు.
ఎందుకంటే క్యాబ్ రైడింగ్ అనేది చాలా సేఫ్ గా ఫీల్ అవుతారు.అయితే డ్రైవర్ నడిపే దాన్ని బట్టి ఆ ప్రయాణం సౌకర్యవంతమా, నరకమా అనేది తేలిపోతుంది.
ఎందుకంటే ఈమధ్య కాలంలో క్యాబ్ డ్రైవర్లు రకరకాల విషయాలలో వివాదాల పాలు అవుతున్నారు.
"""/" /
బుక్ చేసిన సమయానికి రాకపోవడం కావచ్చు, దురుసు ప్రవర్తన కావచ్చు, అనుకున్న దాని కన్నా ఎక్కువ చార్జీలు వసూలు చేయడం కావచ్చు, అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించడం కావచ్చు, రాష్ డ్రైవింగ్ వంటి అనేక వివాదాల నేపథ్యంలో నేడు క్యాబ్ బుక్ చేసుకునేందుకు ప్రయాణీకులు చాలామంది భయపడుతున్న పరిస్థితి.
అయితే ఇపుడు మనం చెప్పుకోబోయే ఈ క్యాబ్ డ్రైవర్ అలాంటివారందరికీ కాస్త భిన్నం.
అతడు చాలా బాధ్యతాయుతమైన క్యాబ్ డ్రైవర్.అంతేకాదండోయ్! ప్రయాణీకుల సంక్షేమం కోసం ఆలోచించే అద్భుతమైన డ్రైవర్.
అతడే అబ్దుల్ ఖాదీర్. """/" /
ఈ డ్రైవర్ ప్రయాణీకుల కోసం ఏం చేశాడో తెలిస్తే.
మెచ్చుకోకుండా ఉండలేరు.ఉత్తర ప్రదేశ్‌కు( Uttar Pradesh ) చెందిన అబ్దుల్ ఖాదీర్( Abdul Khadir ) క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.
అతడు డ్రైవింగ్ జాబ్ ఒక పనిలాగా కాకుండా ఒక ప్యాషన్ లాగా చేస్తాడు.
అతని క్యాబ్ ఒక్కసారి ఎక్కినవారు మరలా మరలా ఎక్కుతూనే వుంటారు.అందులో అన్ని రకాల సౌకర్యాలు లభిస్తాయి.
అందుకే అతడి కారులో ప్రయాణించేందుకు చాలామంది ఆసక్తి చూపుతుంటారు.ఇందులో స్నాక్స్, కూల్ డ్రింక్స్, న్యూస్ పేపర్, వైఫై వంటి అనేకరకాలైన సదుపాయాలు ఉంటాయి.
ఇక ఖాదీర్ వీటి కోసం ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయడం లేదు.
ఈ విషయాన్ని ఓ ప్రయాణీకుడు తన ట్విట్టర్‌లో పేర్కొనగా ఆ న్యూస్ వైరల్ అవుతుంది.
నెలసరి సమయానికి రకపోవడానికి మీకుండే ఈ అలవాట్లు కూడా కారణమే..తెలుసా?