లోకేష్ కి భయం అంటూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్( Nara Lokesh ) పై శాప్ చైర్మన్ వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ( Byreddy Siddhartha Reddy )సంచలన వ్యాఖ్యలు చేశారు.
నారా లోకేష్ ఢిల్లీకి ఎందుకెళ్లారో అందరికీ తెలుసని చెప్పుకొచ్చారు.చంద్రబాబు అరెస్టు కావటంతో లోకేష్ భయంతో వణికి పోతున్నారు.
గతంలో ఐటీ మంత్రిగా ఉన్న లోకేష్ స్కిల్, ఫైబర్ కుంభకోణాలతో సంబంధం లేదని ఎలా అంటారు.
? చంద్రబాబు అరెస్టును తప్పుపట్టే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు స్కాం లు కనిపించడం లేదా అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిలదీశారు.
ఇదిలా ఉంటే నారా లోకేష్ ఢిల్లీలోనే ఉంటూ.ఏపీ టీడీపీ ( TDP )నేతలకు దిశా నిర్దేశం చేస్తూ ఉన్నారు.
చంద్రబాబుకి బెయిల్ తీసుకురావడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు.సుప్రీంకోర్టులో పెద్దపెద్ద లాయర్లతో మంతనాలు జరుపుతూ.
న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు.ఇదే సమయంలో జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా తీసుకెళ్తూ ఉన్నారట.
రేపటి నుండి "యువగళం" పాదయాత్ర స్టార్ట్ చేయాలని భావించిన గాని పరిస్థితులు అనుకూలించకపోవడంతో మరికొన్ని రోజులు వాయిదా వేయడం జరిగింది.
పైగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పేరు చేర్చడంతో పాటు చంద్రబాబు( Chandrababu ) గారిపై కూడా పీటీ వారెంట్ లు జారీ చేయడంతో.
న్యాయపరంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండటంతో పాదయాత్ర వాయిదా వేసినట్లు టీడీపీ పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేయడం జరిగింది.