బైపాస్ రోడ్డు ల డివైడర్, ఎవెన్యూ ప్లాంటేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా :సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో రెండు బైపాస్ ల డివైడర్, ఎవెన్యూ ప్లాంటేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్, పంచాయితీ రాజ్ అధికారులను అదేశించారు.

శుక్రవారం సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో రెండు బైపాస్ ల డివైడర్, ఎవెన్యూ ప్లాంటేషన్ పనులను జిల్లా కలెక్టర్ పంచాయితీ రాజ్ కార్యనిర్వహక ఇంజనీర్ సూర్య ప్రకాష్, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ లతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

డివైడర్, ఎవెన్యూ ప్లాంటేషన్ కు పెద్ద మొక్కలను ఉపయోగించాలని చెప్పారు.మొక్కలు నాటే సమయంలో మొక్కల కు సపోర్ట్ గా పొడవాటి కర్రను పాతాలన్నారు.

డివైడర్ మధ్యలో రెండు పెద్ద మొక్కల మధ్య పూలనిచ్చే చిన్న మొక్కలను నాటాలాన్నారు.

ఎచ్ ఎం డి ఎ నుంచి వాటిని సమకూర్చుకోవాలన్నారు.ట్యాంకర్ ల సహాయంతో క్రమం తప్పకుండా నీటిని మొక్కలను అందివ్వాలన్నారు.

ఉన్నవి కాపాడుకుంటూనే ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను వెంటనే నాటాలన్నారు.బైపాస్ రోడ్ ల లో లైటింగ్ పనులను పూర్తి చేయాలన్నారు.

రాజబాబు అసలు పేరేంటో మీకు తెలుసా.. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నారా?