పేరుకే ప్లీన‌రీ మీటింగ్‌.. కేసీఆర్ స్పీచ్ మొత్తం హుజూరాబాద్ గురించే..

తెలంగాణ‌లో టీఆర్ఎస్ ఏ స‌భ పెట్టినా దానికి ఓ ముంద‌స్తు ప్లాన్ అనేది క‌చ్చితంగా ఉంటుంది.

గ‌తంలో చాలా సార్లు ఎన్నిక‌ల‌కు ముందు పెద్ద పెద్ద స‌భ‌లు పెట్టి ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించే వారు సీఎం కేసీఆర్‌.

సాధార‌ణ ఎన్నిక‌ల‌ప్పుడు కూడా ఇలాగే ప్ర‌గ‌తి నివేదిక లాంటి స‌భ‌లు ఏర్పాటు చేసి ఓ చ‌రిత్ర సృష్టించారు.

కాగా ఆయ‌న ఇప్పుడు మ‌రోసారి ఇలాంటి ప్లాన్ వేసేశారు.టీఆర్ఎస్ ఏర్పాటు అయి ఇరవై ఏళ్లు గ‌డుస్తున్న సంద‌ర్భంగా నిన్న ప్లీనరీ స‌మావేశం ఏర్పాటు చేశారు.

దీనికి పెద్ద ఎత్తున పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు వ‌చ్చారు.అయితే పార్టీ మీటింగ్ అయినా కూడా కేసీఆర్ టార్గెట్ చేసింది మాత్రం హుజూరాబాద్ ఉప ఎన్నిక‌నే.

ఆయ‌న త‌న ప్ర‌సంగంలో చాలా వ‌ర‌కు హుజూరాబాద్‌లో చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల గురించి, అలాగే ద‌ళిత బంధు గురించి మాట్లాడారు.

ఇంకో విష‌యం కూడా ఆయ‌న స్ప‌ష్టంగా తెలియ‌జేశారు.హుజూరాబాద్‌ లో త‌మ పార్టీ జెండానే ఎగురుతుంద‌ని ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రాలు అక్క‌ర్లేదంటూ తేల్చి చెప్పారు.

అయితే త‌న పార్టీ మీటింగు విష‌యంలో ఈసీ హ‌ద్దు దాటి ప్ర‌వ‌ర్తించింద‌ని వాపోయారు.

త‌మ స‌భ‌ను ముందుగా హుస్నాబాద్‌లో లేదంటే హ‌న్మ‌కొండ‌లో నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. """/"/ కానీ ఈసీ ఆదేశాలు ఎన్నిక‌లు ఉన్న ప‌క్క జిల్లాలో కూడా త‌మ స‌భ‌ను పెట్టుకోనివ్వ‌కుండా అడ్డు ప‌డ్డాయ‌ని ఇది మంచిది కాదంటూ చెప్పారు.

నిజానికి హుజూరాబాద్ ప‌క్క జిల్లాలో స‌భ నిర్వ‌హిస్తే గ‌న‌క ఆ ఎన్నిక‌ల‌ను టార్గెట్ చేయొచ్చ‌ని కేసీఆర్ ప్లాన్‌.

కానీ అది కుద‌ర‌క‌పోవ‌డంతో ఆయ‌న స‌భ నిర్వ‌హించే స్థ‌లాన్ని మార్చుకోవాల్సి వ‌చ్చింది.దీంతో ఈసీ రాజ్యాంగ ప‌రిధిని దాటిపోతోంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు.

పైగా ఎన్నిక‌ల స‌మ‌యం అని దళిత బంధు స్కీమ్‌ను ఆపేయ‌డం ఎంత వ‌ర‌కు సమంజస మంటూ మండిప‌డ్డారు.

దీన్ని బ‌ట్టి చూస్తే కేసీఆర్ ప్లీన‌రీ స‌మావేశాన్ని కాస్తా ఎల‌క్ష‌న్ స‌భ‌లా మార్చేశార‌న్న‌మాట‌.

కాకినాడ సభలో పవన్ పై సీఎం జగన్ సెటైర్లు..!!