ఈ వస్తువులను గురువారం రోజు బీరువాలో ఉంచడం వల్ల.. ఆ ఇంట్లోకి ధనలక్ష్మి..?
TeluguStop.com
సనాతన ధర్మంలో ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది.హిందూ మతంలో సోమవారాన్ని శివుడికి, మంగళవారాన్ని ఆంజనేయస్వామికి, బుధవారాన్ని సుబ్రహ్మణ్యస్వామికి, గురువారాన్ని శ్రీమహావిష్ణువుకు( Lord Vishnu ), శుక్రవారం లక్ష్మీదేవికి, శనివారం వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడి ఉంది.
అయితే గురువారం రోజు శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించడం ద్వారా బృహస్పతి( Jupiter) వారి జీవితంలో బలంగా ఉంటాడని ప్రజలు నమ్ముతారు.
ఎవరి జాతకంలో అయితే బృహస్పతి బలంగా ఉంటాడో వారు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తారని బలంగా నమ్ముతారు.
ముఖ్యంగా చెప్పాలంటే గురువారం ( Thursday )రోజు కొన్ని వాస్తు నియమాలను పాటిస్తే ఖచ్చితంగా పాటించాలి.
ఇంకా చెప్పాలంటే బీరువాలో( Beeruva ) డబ్బులను భద్రంగా పెట్టే లాకర్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ధనలక్ష్మి ఇంటికి నడిచి వస్తుందని ప్రజలు నమ్ముతారు.
గురువారం కొన్ని వస్తువులను బీరువాలో పెట్టడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు.
"""/" /
సహజంగా గురువారం రోజు ఎవరైనా శ్రీమహావిష్ణువుకి కానీ సాయిబాబా కానీ పూజ చేస్తారు.
అయితే గురువారం రోజు పూజించిన మంచి ఫలితం ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు.
ఒక కొబ్బరికాయను తీసుకొని గురువారం రోజు శివాలయానికి వెళ్లి కొబ్బరికాయను శివలింగానికి తాకించి మనసులో ఉన్న కోరికలను చెప్పి శివపార్వతులను పూజించి ఆ తర్వాత ఆ కొబ్బరికాయను ఇంటికి తీసుకొచ్చి బీరువాలో భద్రంగా పెట్టాలని చెబుతున్నారు.
"""/" /
అలా చేస్తే ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు.ఏమైనా ఇంకా చెప్పాలంటే గురువారం రోజు ఎవరైతే శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని తులసి దళాలతో, పసుపు రంగు పుష్పాలతో పూజిస్తారో వారు పూజ పూర్తి అయిన తర్వాత తులసి దళాన్ని, పసుపు రంగు పుష్పాన్ని బీరువాలో పెట్టడం వల్ల అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతున్నారు.
గురువారం రోజు బీరువాలో దేవుడు పూజకు ఉపయోగించిన ఎర్రటి వస్త్రాన్ని పెట్టినా ఐశ్వర్యం వచ్చి పడుతుందని, ధనానికి ఎటువంటి లోటు ఉండదని కూడా చెబుతున్నారు.
ఫ్యామిలీ మీల్‌పై మూత్రం పోసిన కొడుకు.. ఎంకరేజ్ చేసిన తల్లి..?