రోజుకు రెండు స్టాబెర్రీలు తినడం వల్ల.. శరీరంలో కలిగే అద్భుతమైన మార్పులు ఇవే..!
TeluguStop.com
స్ట్రాబెర్రీలు( Strawberry ) సూపర్ మార్కెట్లలో అన్ని సీజన్లోనూ లభిస్తాయి.ముఖ్యంగా పిల్లలు వీటీని తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు.
నిజానికి పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ పండ్లను తింటూ ఉంటారు.రోజుకు రెండు స్ట్రాబెర్రీ పండ్లు తింటే చాలు శరీరంలో ఎన్నో సానుకూల మార్పులు జరుగుతాయి.
స్ట్రాబెర్రీ లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.వీటిని తినడం వల్ల శరీరం తేమగా ఉంటుంది.
ఇతర పండ్లతో పోలిస్తే దీనిలో కార్బోహైడ్రేట్లు కూడా తక్కువగా ఉంటాయి.కాబట్టి వీటిని తిన్నాక రక్తంలో చక్కెర స్థాయి అధికంగా పెరుగుతుందన్న భయం కూడా అవసరం లేదు.
"""/" /
కాబట్టి మధుమేహ రోగులు( Diabetics ) కూడా స్ట్రాబెర్రీలను ఎక్కువగా తినవచ్చు.
అలాగే మన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ K లాంటివి ఈ పండ్లలో ఎక్కువగా ఉంటాయి.
ఇవన్నీ కూడా మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.వీటిని రోజు తినడం అలవాటు చేసుకోవాలి.
వీటిని రోజు తినడం వల్ల జీవక్రియ సమస్యలు, ఏకగ్రత లోపాలు వంటివి రాకుండా ఉంటాయి.
ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్ని నిరూపించాయి.ఇంకా చెప్పాలంటే స్ట్రాబెర్రీలు అధికంగా తినడం వల్ల అల్జీమర్స్, మతిమరుపు వంటివి రాకుండా ఉంటాయి.
దీని వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది.దీనిలో ఉండే పొటాషియం గుండెకు ఎంతో ఉపయోగపడుతుంది.
"""/" /
ఇది రక్తపోటును నియంత్రణలో ఉండేలా చేస్తుంది.వీటిని తినడం వల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.
తలనొప్పి,అలెర్జీ, నిద్రలేమి( Insomnia ) వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
స్ట్రాబెర్రీలు తినడం వల్ల కంటి శుక్లాలు వంటివి కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
అలాగే ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి.స్ట్రాబెర్రీలు నోటి క్యాన్సర్( Mouth Cancer ) రాకుండా అడ్డుకుంటాయి.
నోటి దుర్వాసనను నివారిస్తాయి.దంత సమస్యలను రాకుండా చేస్తాయి.
పొట్టలోని అల్సర్స్ రాకుండా అడ్డుకోవడంలో కూడా స్ట్రాబెర్రీలు కీలక పాత్ర పోషిస్తాయి.
సాంకేతిక లోపంతో ఎక్కడికక్కడ ఆగిపోయిన హైదరాబాద్ మెట్రో రైళ్లు..