నెయ్యితో ఇలా చేయడం వలన.. అంతులేని అందం ఇక మీ సొంతం..!
TeluguStop.com
సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా చాలా అందంగా( Beautiful ), కాంతివంతంగా కనిపించాలి అని అనుకుంటారు.
అయితే అందుకు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు.అయితే నెయ్యి( Ghee )ని వాడడం వలన కచ్చితంగా చాలా అందంగా మెరిసిపోవచ్చు.
అయితే సరైన విధంగా నెయ్యిని ఉపయోగించుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఇక ఒక గిన్నెలో మూడు టీ స్పూన్ల కరిగించిన నెయ్యిని తీసుకోవాలి.ఆ తర్వాత అందులో మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనె ( Coconut Oil )లేదా బాదం నూనె బాగా కలపాలి.
ఇక ఆ తర్వాత దాన్ని గాజు సీసాలో నిల్వ చేసుకొని ఉపయోగిస్తూ ఉండాలి.
ఇలా తయారు చేసుకున్న నెయ్యి చర్మానికి రాసుకోవడం వలన చర్మం చాలా సమయం దాకా పొడిబారకుండా ఉంటుంది.
"""/" /
అలాగే మన పెదవులు అందంగా,పొడిబారకుండా ఉండడానికి కూడా లిబ్ బామ్ లను ఎక్కువగా వాడుతూ ఉంటాము.
కానీ వాటికి బదులుగా ఇలా తయారు చేసుకున్న నెయ్యిని వాడడం వలన పెదవులు అందంగా, పొడిబారకుండా అలాగే పగలకుండా ఉంటాయి.
ఇక ప్రతిరోజు పడుకునే ముందు రెండు లేదా మూడు చుక్కల నెయ్యి పెదవులపై రాసుకొని సున్నితంగా మర్దన చేసుకోవాలి.
ఇలా చేయడం వలన పగిలిన పెదవులకు తగిలిన తేమ లభించి అవి తిరిగి మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తాయి.
"""/" /
అలాగే పెదవులు చక్కటి రంగులో కూడా కనిపిస్తాయి.ఇక చర్మంపై పేరుకుపోయిన మృతకనాలను కూడా నెయ్యి ఈజీగా తొలగిస్తుంది.
అయితే బయట లభించే వాటిని వాడడం కన్నా నెయ్యితో మనం చక్కటి స్క్రబ్బర్ ను తయారు చేసుకొని చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించుకునేందుకు వాడుకోవచ్చు.
అయితే దీనికోసం ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల నెయ్యి కరిగించి రెండు టీ స్పూన్ల కొబ్బరిపాలు,( Coconut Milk ) ఒక టీ స్పూన్ పంచదార, ఒక టీ స్పూన్ శనగపిండి వేసి బాగా కలుపుకొని దీన్ని స్క్రబ్ లాగా తయారు చేసుకొని నిల్వ చేసుకొని ఉపయోగిస్తూ ఉండాలి.
అప్పుడు మంచి ఫలితం ఉంటుంది.
భార్య బాధిత టెక్కీ ‘అతుల్ సుభాష్’కు ఓ రెస్టారెంట్ వినూత్నరీతిలో నివాళి!