వినాయకునికి పూజ ఇలా చేయడం వల్ల జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయా..

మన దేశవ్యాప్తంగా వినాయకుని పండుగను చాలామంది ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఒక్కోచోట మూడు రోజులు, మరికొన్ని చోట్ల ఐదు రోజులు, పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఏడు రోజుల తర్వాత వినాయకుడి నిమర్జనం చేస్తారు.

అప్పటివరకు ప్రతిరోజు వినాయకునికి పూజలు చేస్తూ పిండి పదార్థాలు వండి నైవైద్యం సమర్పిస్తారు.

మనదేశంలో చాలామంది ప్రజలు ఏ శుభకార్యం చేయడానికి అయినా,ఏ మంచి పని చేయడానికి అయినా ముందుగా గణపయ్య పూజ చేయడం పూర్వం నుండి వస్తున్న ఆచారం.

వినాయకుని పూజించడం వల్ల జీవితంలో ఉన్న దుఃఖాలు, బాధలు తొలగిపోతాయని చాలామంది ప్రజల నమ్మకం.

కానీ బుధవారం రోజు గణపతి ఆరాధన చేసేవారికి ప్రత్యేక ఫలితాలు ఉంటాయి.శివపార్వతుల ముద్దుల బిడ్డ వినాయకునికి పూజకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ దేవునికైనా పూజ చేసిన తర్వాత నైవేద్యం సమర్పించేంతవరకు ఆ పూజ పూర్తి అయినట్లు కాదు.

అలాంటి పరిస్థితులలో గణపతిని పూజించేటప్పుడు గణపతికి ఇష్టమే పిండి వంటలను నైవేద్యంగా సమర్పించడం ఆచారం.

ఇలాంటి వంటకాలు అర్థం కాకపోతే అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పించవచ్చు.గణపయ్య పూజ సమయంలో వినాయకుని ఆశీర్వాదం పొందడానికి కుంకుమ ఎర్రటి పువ్వులు, దర్భగడ్డి సమర్పించాలి.

ఇవి ఇవి గణపతికి ఎంతో ఇష్టమైనవి.ఇలాంటివన్నీ నైవేద్యంగా సమర్పించడం వల్ల మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి.

"""/"/ బుధవారం రోజున ఏ కారణం తో నైనా గణపతి ఆలయానికి వెళ్లలేకపోతే ఇంట్లో అయినా గణపతి విగ్రహం లేకపోయినట్లయితే ఇంట్లోనే తమలపాకు పోయి గణపతి వినాయకుని తయారుచేసి పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు.

ఎవరి జీవితంలోనైనా చేపట్టిన ఏ మంచి కార్యంలో అయినా అడ్డంకులు ఎదురవుతూ ఉంటే ప్రతి బుధవారం ‘ఓం గం గణపతయే నమః ‘ లేదా ‘ ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో బుద్ధిః ప్రచోదయాత్’ అనే మంత్రాన్ని జపిస్తూ, వినాయకుని ముందు దీపం వెలిగించడం వల్ల మనసులోని మంచి కోరికలన్నీ నెరవేరిపోతాయి.

అప్పడాలు అమ్ముతున్న బుడ్డోడు.. రూ.500 ఇస్తానంటే వద్దన్నాడు.. కారణం తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే!