ప్రతిరోజు ఈ పనులు చేయడం వలన.. సంతోషంతో పాటు ఆరోగ్యం కూడా..!

ప్రతి ఒక్కరు కూడా తమ జీవితం ఆనందంగా, సంతోషంగాఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు.కానీ కొన్ని అలవాట్లను పాటించడంలో పొరపాట్లు చేస్తుంటారు.

ఇక చాలామంది ఉదయం లేవగానే ఆరోగ్య విషయాలను విస్మరిస్తున్నారు.దీంతో అనేక దీర్ఘకాలిక వ్యాధులను( Chronic Diseases ) తెచ్చుకుంటున్నారు.

అయితే వర్క్ బిజీ తో పాటు సరదాగా ఉండేందుకు మంచి అలవాటులను దూరం చేసుకుంటూ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాటులను అలవాటు చేసుకుంటున్నారు.

అయితే జీవితంలో క్రమశిక్షణగా ఉండి కొన్ని అలవాటులను మార్చుకుంటే మాత్రం జీవితం సంతోషకరంగా మారుతుంది.

ముఖ్యంగా కొన్ని అలవాటులతో అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ఈ మధ్యకాలంలో చాలా మంది ఉదయం లేవగానే ఫోన్ తోనే రోజును ప్రారంభిస్తున్నారు.

కొంతమంది వర్క్ అవసరాలకు అయితే మరికొందరు సరదా కోసం ఫోన్ లు చూస్తున్నారు.

అయితే ఉదయం ఫోన్( Phone ) చూడడం వలన కళ్ళపై ప్రభావం పడుతుంది.

ఫోన్ నుంచి వెలవాడే లైటింగ్ తో కళ్ళపై ప్రభావం పడి తొందరగా కళ్ళు సమస్యలు వస్తాయి.

ఇక చాలా మందికి బద్దకం ఉండడం వలన ఉదయం లేవగానే స్నానం చేయకుండా సూర్యోదయం తర్వాత స్నానం చేస్తుంటారు.

అయితే సూర్యోదయానికి ముందు స్నానం చేయడం వలన శరీరంలో జీవక్రియలు సక్రమంగా పనిచేస్తాయి.

"""/" / అంతేకాకుండా ఉదయాన్నే స్నానం చేయడం వలన మనసు ప్రశాంతంగా మారి రోజు ఉత్సాహంగా గడుస్తుంది.

ఇక చాలా మంది పనులతో బిజీగా ఉండడం వలన ఉదయం ఏం తీసుకోకుండానే వెళ్ళిపోతూ ఉంటారు.

కానీ ఉదయాన్నే కచ్చితంగా ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి.ఖాళీ కడుపుతో ఉండడం వలన జీర్ణ సమస్యలు వస్తాయి.

ఇక మరికొందరు ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగి సరి పెట్టుకుంటాడు.

ఇలా చేయడం వలన శరీరం హీట్ ఎక్కుతుంది.ప్రతిరోజు చాలామంది ఎప్పుడు చూసినా నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటారు.

కానీ ఎప్పుడూ కూడా అంతా మంచే జరుగుతుందని భావించాలి.ఇతను చెప్పిన విషయాలను వింటూనే మనకు నచ్చిన విధంగా జీవితాన్ని గడపాలి.

పీకల దాక తాగేసిన యువతి.. ఆ కంట్రీ ఫ్లైట్ తీసుకోబోయి తప్పు చేసిందే..?