అపరిచితుడు తర్వాత ఆ రేంజ్ హిట్ లేదుగా.. తంగలాన్ తో ఆ కోరిక తీరుతుందా?
TeluguStop.com
తమిళ హీరో విక్రమ్( Vikram ) నటించిన తంగలాన్ సినిమా( Thangalaan ) ఆగస్టు 15 విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్ ను చేస్తున్నారు విక్రమ్.
ఇదివరకటిలా ఏదో మొక్కుబడిగా కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటించి తన మూవీ గురించి ప్రేక్షకులకు తెలిసేలా చేస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు.
ఒరిజినల్ వెర్షన్ బుకింగ్స్ దుమ్ము రేపుతున్న తమిళనాడులో కాకుండా ఇక్కడ ఫోకస్ పెట్టడానికి కారణం లేకపోలేదు.
డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఆయ్ నుంచి తంగలాన్ కు తీవ్రమైన పోటీ ఎదురవుతోంది.
ఓపెనింగ్స్ మీద వీటి ప్రభావం తీవ్రంగా ఉండనుంది. """/" /
అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ గమనిస్తే రామ్, రవితేజ లు ఉన్నంత దూకుడుగా విక్రమ్ కనిపించడం లేదు.
పొన్నియిన్ సెల్వన్ వచ్చిన సమయంలో కాంపిటీషన్ లేకపోవడంతో పాటు మణిరత్నం బ్రాండ్ తోడై జనం ఆసక్తి చూపించారు.
కానీ తంగలాన్ కేసు వేరు.ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు.
గ్లామర్ అంశాలు, మాస్ విజిల్స్ కొట్టించే డైలాగులు, గూస్ బంప్స్ ఎపిసోడ్స్ ఉండవు.
కానీ ఒక సరికొత్త ప్రపంచం లోకి తీసుకెళ్లేలా దర్శకుడు పా రంజిత్( Pa Ranjith ) దశాబ్దాల వెనుకటి కథ తీసుకున్నాడు.
బంగారం కోసం ఒక అటవీ జాతి చేసే యుద్ధంలో శపించబడిన దెయ్యం వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ మీద రూపొందించారు.
"""/" /
ఇంత కష్టపడి నటించినందుకు, ప్రమోషన్లు చేసుకున్నందుకు విక్రమ్ కు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.
జైలర్ తర్వాత తమిళ డబ్బింగులు పెద్దగా ఆడిన దాఖలాలు లేని నేపథ్యంలో తంగలాన్ మీద భారీ బరువు ఉంది.
దాన్ని నిలబెట్టుకోవడం కీలకం.విక్రమ్, మాళవిక మోహనన్ తో సహా ఎవరిని అంత సులభంగా పోల్చుకోలేనంత విచిత్రమైన గెటప్పులతో కనిపిస్తున్న ఈ హిస్టారిక్ డ్రామా కనక తెలుగులోనూ హిట్ అయితే నిజంగా హిస్టరీగా చెప్పుకోవచ్చు.
సంక్రాంతి సీజన్ ని తలపించేలా ఆగస్ట్ 15 జరుగుతున్న పోటీలో అనువాదంతో వస్తున్న తంగలాన్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి.
అయితే అపరిచితుడు( Aparichitudu ) తర్వాత విక్రమ్ ఆ రేంజ్ హిట్ మళ్లీ అందుకోలేదు.
మరి ఈ తంగలాన్ సినిమాతో అయినా ఆ రేంజ్ హిట్ అందుకుంటారో లేదో చూడాలి మరి.
ఆ సినిమా వల్లే తట్టుకున్న దిల్ రాజు.. లేకపోతే అంతే సంగతులు..!