తమిళంలో గేమ్ ఛేంజర్ హిట్టవ్వడం సాధ్యమేనా.. అక్కడ ఏం జరుగుతుందో?

తమిళ్ స్టార్ దర్శకుడు శంకర్( Shankar ) దర్శకత్వంలో రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటించిన చిత్రం గేమ్ చేంజర్.

( Game Changer ) కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.

దీంతో ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.

"""/" / ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో ఇంకా చాలా సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.

తెలుగులో ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కానీ తమిళంలో మాత్రం గేమ్ చేంజర్ సినిమా టఫ్ పరిస్థితిలను ఎదుర్కోబోతోంది అనే వార్త గట్టిగా వినిపిస్తోంది.

స్టార్ హీరో అజిత్( Ajith ) నటించిన విదాముయార్చి చిత్రం( Vidaa Muyarchi Movie ) కూడా పొంగల్ రేసులో రిలీజ్ అవుతోంది.

ఈ చిత్రాన్ని తమిళ్‌ లో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

"""/" / దీంతో ఎక్కువ థియేటర్లలో అజిత్ సినిమానే రిలీజ్ అవనుంది.గేమ్ ఛేంజర్ కు థియేటర్లు దొరికినా, తమిళ్ ఆడియన్స్ ఫస్ట్ ప్రియారిటీ అజిత్ సినిమాకే ఉంటుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఈ లెక్కన గేమ్ ఛేంజర్ సినిమాకు తమిళ్‌ లో టఫ్ జాబ్ తప్పేలా లేదని సినీ క్రిటిక్స్ అంటున్నారు.

మరి తమిళ్ బాక్సాఫీస్ దగ్గర గేమ్ ఛేంజర్ ఎలాంటి రిజల్ట్ రాబడతాడో చూడాలి మరి.

ఇకపోతే సినిమా విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో మూవీ మేకర్ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.

రోజూ ఈ జ్యూస్ తాగండి.. నాజూగ్గా మారండి..!