దళారీల వ్యవస్థ లేకుండా ధాన్యం కొనుగోలు.. మంత్రి కారుమూరి

రైతులకు మేలు జరగాలనేదే ఏపీ సీఎం జగన్ లక్ష్యమని మంత్రి కారుమూరి అన్నారు.

దళారీల వ్యవస్థ లేకుండా ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు.

ఈ సీజన్ లో సుమారు 39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.

వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు రాగులు, జొన్నలు పంపిణీ చేస్తామని వెల్లడించారు.

ఇప్పటికే ఫైలట్ ప్రాజెక్టుగా వైజాగ్ లో గోధుమపిండి అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

అంతేకాకుండా ఆ పంటలు వేసే విధంగా రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు.

యూకే: ఎత్తు శాపమనుకుంది… ఇప్పుడదే లక్షణంతో కోట్లకు పడగలెత్తింది!