పెప్సీ కొంటే బంపర్ ఆఫర్.. ఎయిర్‌టెల్ పండుగ ఆఫర్

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ మరో ఆఫర్ ను కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది.

ఎయిర్ టెల్ కాస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు అనేక ఆఫర్లను తెస్తూ ఉంటుంది.తాజాగా పండుగ ఆఫర్ క్రింద మరో ఆఫర్ ను మార్కెట్ లోకి తెచ్చింది.

తాజాగా కస్టమర్లకు ఎయిర్ టెల్ గుడ్ న్యూస్ తెలిపింది.ప్రముఖ సాప్ట్ డ్రింగ్ సంస్థ పెప్సీతో ఎయిర్ టెల్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం ద్వారా రీచార్జ్ కూపన్స్ ను ఎయిర్ టెల్ ప్రవేశపెట్టనుంది.అంతే పెస్సీ కొనుగోలు చేసినవారికి రీచార్జ్ కూన్స్ రానున్నాయి.

పెప్సీ, మౌంటైన్ డ్యూ, మిరిండా, 7UP,స్లైస్, ట్రోపికానా పెట్ తో పాటు పెస్సీకి సంబంధించిన ఇతర శీతల పానియాలను కొనుగోలు చేస్తే ఎయిర్ టెల్ రీచార్జ్ కూపన్లు అందించనుంది.

రూ.10 నుంచి రూ.

20 విలువైన రీఛార్జ్ కూపన్లను అందించనుంది.పెప్సీ ప్రత్యేక ఎడిషన్ బాటిళ్లలో లేబుల్ వెనుక వైపు ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ డిస్కౌంట్ కోడ్ ఉంటుంది.

12 అంకెల కోడ్ కూపన్ ద్వారా రీ్చర్జా్ కూపన్లను రిడీమ్ చేసుకోవచ్చని ఎయిర్ టెల్ వర్గాలు తెలిపాయి.

అయితే ఈ ఆఫర్ కు కొన్ని కండీషన్లు పెట్టింది.ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ లో కనీసం రూ.

99 రీఛార్జ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది.ప్రతి మొబైల్ నెంబర్ కు రెండుసార్లు మాత్రమే డిస్కౌండ్ కోడ్ లు పనిచేస్తాయి.

ఫిబ్రవరి 2023 వరకు ఈ ఆఫర్ అందుబాాటులో ఉంటాయని పెప్సీ, ఎయిర్ టెల్ కంపెనీలు ప్రకటించాయి.

వినియోగదారులకు పండుగ ఆఫర్ క్రింద వీటిని ప్రకటించినట్లు ఎయిర్ టెల్ మార్కెటింగ, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శాశ్వత్ శర్మ స్పష్టం చేశారు.

కల్కి సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో తెలిసిపోయింది…