బుట్టబొమ్మా.. రికార్డుల మోతకు అడ్డులేదమ్మా!
TeluguStop.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది.
సంక్రాంతి బరిలో విన్నర్‌గా నిలవడమే కాకుండా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.
బన్నీ నటించిన ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఇక ఈ సినిమాకు అసలైన ప్రాణం పోసింది మాత్రం ఖచ్చితంగా సంగీతం అనే చెప్పాలి.
థమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ఎంతటి బలాన్ని అందించిందో ఈ సినిమా పాటలు వింటే తెలుస్తోంది.
సామజవరగమనా, రాములో రాములా, బుట్టబొమ్మా.వంటి పాటలు శ్రోతలను ఉర్రూతలూగించాయి.
ఈ పాటలు యూట్యూబ్‌లో పలు రికార్డులను సైతం క్రియేట్ చేశాయి.కాగా ఇటీవల బుట్టబొమ్మ సాంగ్ యూట్యూ్బ్లో ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్‌గా రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఏకంగా 150 మిలియన్ వ్యూస్ మార్క్‌ను దాటేందుకు రెడీ అవుతోంది ఈ పాట.
బుట్టబొమ్మా అంటూ రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్‌కు థమన్ అదిరిపోయే ట్యూన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమాలో బన్నీ స్టైలిష్ యాక్టింగ్‌కు త్రివిక్రమ్ మార్క్ టేకింగ్ తోడవ్వడంతో ప్రేక్షకులను మెప్పించడంలో అల వైకుంఠపురములో సినిమా విజయం సాధించింది.
పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.
ఈ సినిమా మున్ముందు ఇంకా ఎలాంటి రికార్డులను తన పేరిట నమోదు చేసుకుంటుందో చూడాలి.
బెంగళూరు రేవ్ పార్టీ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం