ఆస్తి మొత్తాన్ని దానం చేసిన బిజినెస్‌మెన్

‘ధనం మూలం ఇదం జగత్’ అని పెద్దలు చెప్పారు.అందుకే ఉదయం లేచింది మొదలు చాలామంది దృష్టి అంతా డబ్బు సంపాదనపైనే ఉంటుంది.

కొంతమంది పది రూపాయలు దానం చేయడానికి ఎంతో ఆలోచిస్తారు.కానీ అందరూ ఒకేలా ఉండరు కదా.

ఈ లోకంలో పిసినారి వాళ్లతో పాటు.దాతృత్వ గుణం ఉన్నవారూ ఉన్నారు.

తాను జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తిని దానం చేసి ఓ వ్యక్తి అందరినీ షాక్‌కు గురి చేశారు.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం బాలాఘాట్‌కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి రాకేశ్ సురానా రూ.

11 కోట్ల విలువైన ఆస్తులను విరాళంగా ఇచ్చేశాడు.గోశాల, ఆధ్యాత్మిక సంస్థలకు వీటిని రాసిచ్చాడు.

అంతేకాదు.విలాసవంతమైన జీవితాన్ని వీడి తన భార్య కొడుకుతో కలిసి ఆధ్యాత్మిక జీవితం గడపాలని సురానా నిర్ణయించుకున్నాడు.

గురు మహేంద్ర సాగర్ స్ఫూర్తితోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు రాకేశ్​సురానా.

ఈ క్రమంలో ఈ నెల 22న జైపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరు ముగ్గురు దీక్ష తీసుకోనున్నారు.

కాగా, ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ముఖ్యంగా జైన సమాజం రాకేశ్, భార్య, కుమారుడిని రథంలో ఊరేగించారు.

ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.డబ్బు సంపాదించి సుఖంగా ఉండటమే జీవితం కాదు.

మనమేంటి అని గుర్తించడమే జీవితం పరమార్థం.మానవుల కోరికలకు ఎప్పటికీ అంతం ఉండదు.

మతం, ఆధ్యాత్మికత విలువల గురించి గురు మహేంద్ర సాగర్ మహరాజ్​, మనీశ్ సాగర్​తో గడిపినప్పుడు తెలుసుకున్నా.

నిజానికి కుమారుడు నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడే ఆధ్యాత్మిక బాట పట్టాలని నిర్ణయించుకున్నామని, కానీ మరీ చిన్నవాడు కావడంతో ఏడేళ్లపాటు ఎదురుచూశామని రాకేష్ తెలిపారు.

అమెరికాలో చదువుకున్న తన భార్యకు కూడా ఆధ్యాత్మిక జీవితంపై ఆసక్తి ఉందని పేర్కొన్నారు.

సౌత్ ఆఫ్రికన్ బిర్యానీ ఇండియన్ బిర్యానీ కంటే రుచిగా ఉంటుందా..?