అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. కమలా హారిస్‌కు భారత సంతతి బిలియనీర్ సపోర్ట్

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోంచి జో బైడెన్ తప్పుకోవడంతో డెమొక్రాటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్ధి ఎవరా అన్న సందిగ్థం నెలకొంది.

ఆయన వెళ్తూ వెళ్తూ.అధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారిస్‌( Kamala Harris )కు తన మద్ధతు పలికారు.

ఆ వెంటనే డెమొక్రాటిక్ పార్టీ( Democratic Party ) సీనియర్ నేతలు, ఇతర ప్రముఖులు ఆమె అభ్యర్ధిత్వానికి సపోర్ట్ చేస్తున్నారు వీరిలో భారతీయ అమెరికన్లూ ఉన్నారు.

తాజాగా భారత సంతతికి చెందిన బిలియనీర్, బే ఏరియా టెక్ మొగల్‌గా పేరొందిన వినోద్ ఖోస్లా స్పందించారు.

"""/" / అమెరికా అధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారిస్‌కు మద్ధతుగా నిలబడాలని.ట్రంప్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు.

మన ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, చెడు విలువలను, ప్రాజెక్ట్ 25ని, ట్రంప్ ఇష్టపడే నియంతృత్వాన్ని తిరస్కరించడానికి అందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని వినోద్ ఖోస్లా( Vinod Khosla ) ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

ట్రంప్‌పై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తీకరించడం ఇదే తొలిసారి కాదు.బైడెన్ రేసులోంచి తప్పుకున్న వెంటనే ట్రంప్‌కు విరాళం ప్రకటించిన ఎలాన్ మస్క్‌( Elon Musk )తో ఖోస్లా చర్చకు దిగారు.

విలువలు లేని, అబద్ధాలు, మోసాలు, అత్యాచారాలు, మహిళలను కించపరిచే, నాలాంటి వలసదారులను ద్వేషించే వ్యక్తికి మద్ధతు ఇవ్వడం తన వల్ల కాదన్నారు.

"""/" / ఇదిలావుండగా.ఢిల్లీ( Delhi )లో జన్మించిన వినోద్ ఖోస్లా అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో వెంచర్ క్యాపిటల్ సంస్థ ఖోస్లా వెంచర్‌ను స్థాపించారు.

వ్యాపారంలో దూసుకుపోతున్న ఆయన ఫోర్బ్స్ ఇండో అమెరికన్ బిలియనీర్‌ల జాబితాలోనూ నిలిచారు.ఆయన ఆస్తుల విలువ 2.

9 బిలియన్ డార్లు.బయోమెడిసిన్, రోబోటిక్స్ వంటి సాంకేతికతల అభివృద్ధిలో ఖోస్లా వెంచర్స్ పెట్టుబడులు పెడుతోంది.

వ్యాపారాల్లో బిజీగా వున్నప్పటికీ.తన జన్మభూమిలోనూ సామాజిక సేవల్లో చురుగ్గా పాల్గొంటున్నారు వినోద్.

భారతదేశాన్ని వణికించిన కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ సిలిండర్లతో పాటు వైద్య సేవల కోసం 10 మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు ఖోస్లా.

మన సీనియర్ హీరోలు ఎప్పుడు అవే సినిమాలా బోరు కొట్టడం లేదా..?