బస్టాండ్‌ లేక కష్టాలు…!

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్- హైదరాబాద్‌( Nagarjunasagar- Hyderabad ) ప్రధాన రహదారిపై ఉన్న నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రం నుండి నిత్యం వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు,విద్యార్థులు హైదరాబాద్‌,ఇబ్రాహీంపట్నం,అచ్చంపేట,మాల్‌, దేవరకొండ,మిర్యాలగూడ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వందలాది మంది బస్సుల్లో ప్రయాణిస్తారు.

ఇక్కడ బస్టాండ్‌ లేక రోడ్ల పక్కన, హోటళ్లు,దుకాణాల వద్ద బస్సుల కోసం నిరీక్షిస్తూ బస్సులు ఎక్కాల్సిన దుస్థితి నెలకొందని,ఇది పాలకుల పని తీరుకు అద్దం పడుతుందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తర్వాత గాలికొదిలేయడం రాజకీయ నాయకులకు పరిపాటిగా మారిందని, పెద్దవూర మండలంలో బస్టాండ్‌ లేకపోవడంతో ప్రయాణికులు,ప్రజలు ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నారని,బస్టాండ్‌ నిర్మాణానికి ఆర్టీసీ కూడా ఎవరూ చొరవచూపడం లేదని వాపోతున్నారు.

బస్టాండ్‌ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారుల,ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదని, వచ్చిపోయే బస్సులు, ఆటోలు రోడ్డుపైనే నిలుపుతుండడంతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోందని,ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు,బీసీ విద్యార్ది సంఘం జిల్లా నాయకులు జోగు రమేష్ కోరుతున్నారు.

వీడియో: పవిత్ర ప్రదేశంలో ఆ పని చేసిన యువతి.. మండిపడుతున్న జపానీయులు..