బైకులకు షెల్టర్ గా బస్ షెల్టర్…!

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూరు(ఎం) మండల( Athmakur (M) ) కేంద్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం గతంలో ఏర్పాటు చేసిన బస్టాండ్ నేడు బైక్ పార్కింగ్ కు అడ్డాగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు.

పరిసర ప్రాంతాల నుండి మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు, పట్టణ ప్రాంతాలకు వెళ్లే వారు బస్సుల కోసం ఈ బస్టాండ్ లో వేచి చూసేవారని,కొత్తగా రోడ్డు నిర్మాణం చేయడంతో బస్టాండ్ కిందకు రోడ్డు పైకి అయిందని,అందులోకి వెళితే తలలకు తగులుతుండడంతో బయటే పిల్లాపాపలతో పాటు లగేజీతో ఎండకు, వానకు నిలబడవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పైగా అందులో ఉంటే వచ్చిపోయే వాహనాలు కనిపించడం లేదని అంటున్నారు.ప్రయాణికులు ఎండ,వానలో నిలబడలేక సమీపంలోని హోటళ్లను,షాపులను ఆశ్రయించక తప్పడం లేదని,ఇక్కడి నుండి వేరే ప్రాంతానికి వెళ్ళే వారు ఖాళీగా ఉండే బస్టాండ్ లో బైక్ పార్కింగ్ చేసి వెళ్లడానికి ఉపయోగపడుతుందని, ఇప్పటికైనా ప్రయాణికుల ఇబ్బందులను గమనించి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి నూతన బస్టాండ్ ఏర్పాటు చేయాలని మండల ప్రజలు,ప్రయాణికులు కోరుతున్నారు.

అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ తో బోల్డ్ సినిమా చేస్తే ఆయన అభిమానులు ఒప్పుకుంటారా..?