గీతకార్మిక బాంధవుడు సీఎం కేసీఆర్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గీతకార్మికులకు 5లక్షల భీమా సదుపాయం కల్పించి సీఎం కేసీఆర్ గీతకార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని బిఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షుడు బుర్ర సూర్యగౌడ్ అన్నారు గత ప్రభుత్వాలు గీత కార్మికులను పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ 51 ఏళ్ళ వయస్సున్న ప్రతి గీతకార్మికుడికి 2016 పెన్షన్ అందజేస్తున్నారని, నీర స్టాల్స్ ఏర్పాటు చేసి గౌడ కులానికి ఒక గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం కే దక్కింది అన్నారు.
గీత కార్మికులు తాటిచెట్టుపై నుంచి ప్రమాదశాత్తూ కింద పడి మృతి చెందిన తక్షణమే ₹5లక్షల భీమా అందే విధంగా కృషి చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్,మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొన్నం శేఖర్ గౌడ్, నాయకులు బత్తిని విప్లవ్ గౌడ్, దొమ్మాటి అనిల్ గౌడ్, కిరణ్ గౌడ్, నరేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభాస్ ను లైన్ లో పెడుతున్న్న స్టార్ డైరెక్టర్స్…వర్కౌట్ అవుతుందా..?