ఇల్లంతకుంటలో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టి బోమ్మ దహనం

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తెలలంగాణ రాష్ట సాంస్కృతిక సారథి చైర్మేన్,మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పల్లె నర్సింహరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు కలసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

అనంతరం రాజన్న సిరిసిల్లా జిల్లా జడ్పీ వైస్ చైర్మేన్ సిద్దం వేణు,ఎంపీపీ ఊట్కూరి వెంకట రమణా రెడ్డి లు మాట్లాడుతూ.

14 సంవత్సరాలు కొట్లాడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు.

రైతే రాజుగా భావించిన కెసిఆర్ ప్రభుత్వంలో అన్నదాతకు అండగా నిలవాలని.ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్ ను సరఫరా చేస్తుంటే, కేవలం మూడు గంటల విద్యుత్తు సరిపోతుందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అనడం రైతన్నలపై ఆయనకున్న మమకారం అర్థమవుతుందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక ఆలోచన విధానాలకు నిదర్శనంగా.రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిలుస్తాయని అన్నారు.

తెలంగాణ రైతాంగ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు,ఎంపీటీసీ లు ,అన్ని అనుబంధాల సంఘాల అధ్యక్షులు ,చైర్మేన్ లు,వైస్ చైర్మేన్ లు,బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అమానుషం.. యువకుడిపై దాడి ఆపై నోట్లో మూత్రం పోసి చిత్రహింసలు..