రుద్రంగిలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) రుద్రoగి మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి( Kaushik Reddy ) పాడే తీసి దిష్ఠి బొమ్మ దహనం చేశారు.

ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం వారు మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం హుజూరాబాద్ లో జరిగిన సంఘటనను రుద్రoగి మండల ముదిరాజ్ సంఘం తరుపున తీవ్రంగా ఖండిస్తూ, కౌశికరెడ్డి బూతులు మాటలను విని తెలంగాణ ప్రజల సిగ్గుపడుతున్నారని అన్నారు.

సభ్య సమాజం సిగ్గు పడేలా మాట్లాడటం ఆ బూతులు వినే వాళ్లకు సిగ్గుగా ఉందని అన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చీడపురుగు కౌశికు రెడ్డి ని ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలని పాడి కౌశిక్ రెడ్డి ముదిరాజ్ లకు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు .

లేనిపక్షంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు గండి నారాయణ,నేవురి చంద్రయ్య, బోయిని నర్సయ్య, కొమిరె శంకర్, పొగుల నర్సయ్య, బోoడ్ల సత్యం, బోయిని రాజు, రాగుల మహేష్,పొగుల దేవయ్య, గండి అశోక్పండుగ గంగాధర్, పాల నర్సయ్య,పిసరి శ్రీనివాస్, అవునూరి లక్ష్మణ్, ముదిరాజ్ కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వీడియో: వాల్‌నట్స్‌ బ్రేక్ చేసి వరల్డ్ రికార్డు సెట్ చేసిన జర్మన్ వ్యక్తి..