రాత్రులు ఉదయాలుగా మారాయి.. బన్నీ భార్య స్నేహారెడ్డి కామెంట్స్ వైరల్!
TeluguStop.com
బన్నీ భార్య స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.పెళ్లి తర్వాత బన్నీ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించడంతో పాటు రికార్డుస్థాయిలో కలెక్షన్లను సాధించాయి.
2011 సంవత్సరం మార్చి నెలలో బన్నీ, స్నేహారెడ్డిల వివాహం జరిగింది.ఈ జంటకు అయాన్, అర్హ పేర్లతో కొడుకు కూతురు ఉన్నారు.
శాకుంతలం సినిమాతో అల్లు అర్హ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే.
అలా వైకుంఠపురములో, పుష్ప ది రైజ్ సినిమాలు బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
తాజాగా బన్నీ తన భార్యతో కలిసి గోవా టూర్ కు వెళ్లారు.స్నేహారెడ్డి గోవా టూర్ కు సంబంధించిన ఫోటోలను, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు.
సోషల్ మీడియాలో స్నేహారెడ్డికి ఏకంగా 6.9 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం గమనార్హం.
"""/" /
స్నేహారెడ్డి ఈ పోస్ట్ లో రాత్రులు ఉదయాలుగా మారాయని ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ లా మారారని చెప్పుకొచ్చారు.
స్నేహారెడ్డి షేర్ చేసిన ఈ ఆసక్తికరమైన క్యాప్షన్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.పుష్ప ది రైజ్ బాలీవుడ్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బాలీవుడ్ మీడియాలో సైతం స్నేహారెడ్డి గురించి చర్చ జరుగుతోంది.
స్నేహారెడ్డి ఫోటోలను ప్రచురిస్తూ బాలీవుడ్ మీడియా ఆమె గురించి పాజిటివ్ గా కథనాలను ప్రసారం చేస్తోంది.
"""/" /
బన్నీ, స్నేహారెడ్డి తమ స్నేహితులతో కలిసి గోవా ట్రిప్ కు వెళ్లారని బోగట్టా.
మరోవైపు బన్నీ ప్రస్తుతం పుష్ప ది రూల్ పై దృష్టి పెట్టారు.త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
సుకుమార్ పుష్ప ది రైజ్ సక్సెస్ తర్వాత పుష్ప ది రూల్ స్క్రిప్ట్ లో మేజర్ మార్పులు చేశారని సమాచారం.
మహాకుంభ్ మోనాలిసా సంచలనం.. 10 రోజుల్లో రూ.10 కోట్లు సంపాదించిన వైరల్ గర్ల్?