వామ్మో.. బన్నీ భార్య ధరించిన చీర ఖరీదెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో స్నేహారెడ్డికి కూడా అదే స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.
బన్నీ భార్యకు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.
తాజాగా స్నేహారెడ్డి చీర ధరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ చీర ఖరీదు తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు.
ఈ చీర ఖరీదు ఏకంగా 1,76,000 రూపాయలు కావడం గమనార్హం.ఈ చీరలో స్నేహ మరింత అందంగా కనిపిస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఇద్దరు పిల్లల తల్లి అయినా స్నేహారెడ్డిలో గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రముఖ డిజైనర్లలో ఒకరైన రిమ్జిమ్ దాదు ఈ చీరను రూపొందించారని తెలుస్తోంది.మెటాలిక్ కార్డ్స్ తో ఈ చీరను తయారు చేయడం గమనార్హం.
మరోవైపు బన్నీ ప్రస్తుతం పుష్ప2 సినిమాలో నటిస్తున్నారు.పుష్ప2 సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా 2023 సంవత్సరంలో విడుదల కావడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
"""/"/ భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా కమర్షియల్ గా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.
భవిష్యత్తులో బన్నీ స్నేహారెడ్డి కలిసి స్క్రీన్ పై కనిపించే అవకాశం ఉంటుందేమో చూడాలి.
బన్నీ స్నేహారెడ్డి కలిసి నటించాలని మరి కొందరు కోరుకుంటున్నారు.ఒక్కో సినిమాకు బన్నీ 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.
సినిమాసినిమాకు బన్నీకి క్రేజ్ పెరుగుతుండగా బన్నీ కొత్త సినిమాలకు సంబంధించి ప్రకటనలు ఎప్పుడు చేస్తారో చూడాల్సి ఉంది.
స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్లకు ఎక్కువగా ఓటేస్తుండటం గమనార్హం.
ఆ రెండు ఏరియాలలో పుష్ప2 మూవీకి షాకిచ్చిన కేజీఎఫ్2.. అసలేం జరిగిందంటే?