మాటలు రావడం లేదు.. ఫ్యాన్ చేసిన పనిపై బన్నీ సిస్టర్ కామెంట్స్ వైరల్!

షార్ట్ ఫిల్మ్స్ ద్వారా వెబ్ సిరీస్ ల ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ సిస్టర్ రోల్ లో నటించి మెప్పించారు.

ఈ సినిమా సక్సెస్ ఆమె కెరీర్ కు ప్లస్ అయింది.ప్రస్తుతం పలు సినిమాల్లో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న బేబీ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తున్నారు.

వరుసగా సినిమాలలో ఆఫర్లను సంపాదించుకుంటున్న వైష్ణవి చైతన్యకు సోషల్ మీడియాలో కూడా భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అయితే తాజాగా వైష్ణవి చైతన్య అభిమాని చేసిన పనికి షాక్ అయ్యారు.మాటలు రావడం లేదంటూ అభిమాని చేసిన పని గురించి వైష్ణవి చైతన్య స్పందించారు.

నిన్న వైష్ణవి చైతన్య పుట్టినరోజు కాగా ఈమె వీరాభిమాని ఒకరు వైష్ణవి పేరును టాటూ వేయించుకుని ఆ వీడియోను ఆమెకు చేరేలా చేశారు.

అభిమాని చేసిన పనికి షాకైన వైష్ణవి చైతన్య ఆ టాటూను చూసిన తర్వాత మాటలు రావడం లేదని ఏం చెప్పాలో కూడా తెలియడం లేదని ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఎమోషనల్ అయ్యారు.

"""/"/వైష్ణవి చైతన్య నటిస్తున్న బేబీ సినిమాకు సాయిరాజేష్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

వైష్ణవి బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ అంతా ఆమెకు పుట్టినరోజు విషెస్ చెప్పారు.

"""/"/ హీరోయిన్ గా వైష్ణవి చైతన్య మరింత సక్సెస్ సాధించడంతో పాటు ఎన్నో సినిమా ఆఫర్లను అందిపుచ్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంవత్సరం సంవత్సరానికి వైష్ణవి చైతన్యకు సినిమా ఆఫర్లు ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.

వైష్ణవి సరైన కథలను ఎంచుకుని స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

ఓట్ల నాడు ఒకమాట.. నాట్ల నాడు మరో మాట..: కేటీఆర్