నా మీద నాకే సిగ్గేసింది.. ఎమోషనల్ అయిన బన్నీ..?

కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చావు కబురు చల్లగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరగగా ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

చావుకబురు చల్లగాసినిమాకు అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా బన్నీవాసు నిర్మాతగా ఉన్నారు.బన్నీవాసు నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలన్నీ దాదాపుగా హిట్లే కావడంతో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ నిర్మాత బన్నీవాసుకు చాలా అరుదుగా మాత్రమే సినిమా కథ నచ్చడం జరుగుతుందని కానీ చావుకబురు చల్లగా సినిమా మాత్రం విన్న వెంటనే నచ్చిందని బన్నీ అన్నారు.

నవదీప్ ఈ కథ విని తనే తీయాలని అనుకున్నాడని కానీ బన్నీవాసు కోరితే ఇచ్చేశాడని చెబుతూ అల్లు అర్జున్ నవదీప్ కు థ్యాంక్స్ చెప్పారు.

నవదీప్ చేసిన సహాయాన్ని గుర్తు పెట్టుకుంటామని అల్లు అర్జున్ తెలిపారు.చావుకబురు చల్లగా సినిమా చూసి తాను షాక్ అయ్యానని మనస్సుకు హత్తుకునే విధంగా ఈ సినిమా ఉందని బన్నీ పేర్కొన్నారు.

సినిమా చూసిన తరువాత డైరెక్టర్ కౌశిక్ వయస్సు 26 సంవత్సరాలే అని తెలిసి నా మీద నాకే సిగ్గేసిందని బన్నీ తెలిపారు.

ఇంత ఫిలాసఫీని చెప్పే దర్శకులు ఉన్నారా అని తనకు అనిపించిందని అల్లు అర్జున్ అన్నారు.

ఈ వయస్సులో కూడా తనకు అంత మెచ్యూరిటీ లేదని అల్లు అర్జున్ తెలిపారు.

"""/"/ కార్తికేయ సినిమాలోని బస్తీ బాలరాజు పాత్రలో అద్భుతంగా నటించాడని ఆ పాత్ర గుండెల్లోకి గుచ్చుకునే విధంగా ఉంటుందని బన్నీ అన్నారు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో లావణ్య త్రిపాఠి చేసిన భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయని ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ లావణ్య ఖాతాలో చేరుతుందని అల్లు అర్జున్ తెలిపారు.

కలకత్తా పైన పంజాబ్ విజయం సాధించడానికి ఆ ఒక్క ప్లేయరే కారణమా..?