ట్విట్టర్ లో ఆ రికార్డు సృష్టించిన తొలి తెలుగు హీరోగా బన్నీ?

టాలీవుడ్ స్టైలిష్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

గంగోత్రి సినిమా ద్వారా హీరోగా తన కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో హీరోగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు.

అల్లు అర్జున్ నటించిన సినిమాలు అన్ని దాదాపుగా సూపర్ హిట్ అయ్యాయి.టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం పుష్ప సినిమా ద్వార అల్లు అర్జున్ క్రేజ్ దేశం మొత్తం తెలిసింది.

సాధారణంగా టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందాలంటే రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలలో నటించాలి అని టాక్ ఉంది.

కానీ అల్లు అర్జున్ ఆ రికార్డును బద్దలు చేస్తూ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు.

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ మాస్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అంతేకాకుండా ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయి.

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ స్థాయిలో లాభాలను తెచ్చిపెట్టింది.ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీలో ఈ సినిమా సంచలనాలు సృష్టించింది.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కనున్న పుష్ప 2 లో నటించనున్నాడు.

ఈ సినిమా ఆగస్టు రెండవ వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది.ఇదిలా ఉండగా పుష్ప సినిమాతో సంచలనాలు సృష్టించిన అల్లు అర్జున్ ఇటీవల మరొక కొత్త రికార్డును క్రియేట్ చేశాడు.

"""/" / సోషల్ మీడియాలో బన్నీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

ఇటీవల సోషల్ మీడియాలో బన్నీ షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.

తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో బన్నీ షేర్ చేసిన ఫోటోలకు రికార్డ్ స్థాయిలో 200k లైక్స్ వచ్చాయి.

అయితే టాలీవుడ్ స్టార్ హీరో చేసిన ట్వీట్ కి 200 వేలకు పైగా లైక్‌లను రావడం ఇదే మొదటిసారి .

దీంతో ట్విట్టర్‌లో ఈ రికార్డు క్రియేట్ చేసిన తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారు.

అల్లు అర్జున్ చేతిలో సిగార్‌తో ఉన్న లేటెస్ట్ ఫోటోను అల్లు అర్జున్ ట్వీట్ చేయగా ఈ ఫోటోలలో బన్నీ డిఫరెంట్ లుక్ నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి పై వైసీపీ సంచలన ఆరోపణలు