సంజయ్ ఇలా ప్లాన్ చేసుకున్నారా ? బీజేపీ కి ఇక మంచి రోజులే ?

తెలంగాణలో బిజేపి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోంది.దుబ్బాక , హుజూరాబాద్ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించినా,  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఎదుర్కునే అంత స్థాయిలో పార్టీ బలోపేతం కాకపోవడం,  ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

తెలంగాణ బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత,  పార్టీలో ఒక రకమైన ఉత్సాహం కనిపించింది .

దీంతోపాటు మూడు చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో బిజేపి విజయం సాధించడం వంటి సానుకూల పరిణామాలు సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత చోటుచేసుకోవడం,  గతంతో పోలిస్తే బీజేపీ బల పడినట్లుగా బీజేపీ పెద్దలు అభిప్రాయ పడుతున్నారు.

ఇవన్నీ సంజయ్ కు మంచి క్రేజ్ తీసుకువచ్చాయి.అయితే తెలంగాణ బీజేపీ లోని కొన్ని గ్రూపులు ఉండడం, సంజయ్ తో పాటు కిషన్ రెడ్డి , తాజాగా ఈటెల రాజేందర్ వర్గాలు ఉండడం ఇవన్నీ సంజయ్ కు  ఇబ్బందికరంగా మారింది.

దీంతో ఒక రకంగా తెలంగాణ బీజేపీ లో ఆధిపత్య పోరు నడుస్తోంది అనే అభిప్రాయాలు అందరిలోకి వెళ్ళిపోయాయి.

ప్రస్తుతం తెలంగాణ బిజేపి చేరికల పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది.  టిఆర్ఎస్ లోని బలమైన నాయకులను పార్టీలోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉంది .

దీనికి సానుకూల పరిణామాలు బిజేపిలో చోటుచేసుకుంటే నే సాధ్యమవుతాయని బండి సంజయ్ అభిప్రాయపడుతున్నారు.

దీనిలో భాగంగానే నియోజకవర్గాల వారీగా ఆయన పర్యటన చేపట్టాలని డిసైడ్ అయ్యారు. """/" / ఈ విషయంలో అధిష్టానం పెద్దల నుంచి ఆయనకు అనుమతి లభించడంతో , తెలంగాణలోని బిజేపి బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో యాత్రలు చేయాలని , టిఆర్ఎస్ టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడంతో పాటు,  పార్టీలో మరింత ఉత్సాహంగా పని చేయాలని,  అలాగే గ్రామాల వారిగా బలమైన పార్టీ నాయకులతో కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

  అలాగే టిఆర్ఎస్ తో పాటు,  కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల తమ పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు.

పాదయాత్ర , బస్సుయాత్ర ఇలా సందర్భాన్ని బట్టి ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ,  తెలంగాణలో బలమైన రాజకీయ పునాదులు బిజేపికి ఉండేవిధంగా చేసేందుకు నిర్ణయించుకున్నారు.

  ఈ మేరకు త్వరలో నియోజకవర్గాల వారీగా యాత్ర ప్రారంభం  అయ్యే అవకాశం ఉన్నట్లు తెలంగాణ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా గెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?