చనిపోయిన బిచ్చగాడి మూడు మూటల్లో లభ్యమైన నోట్ల కట్టలు..

కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కరప మండలం వేలంగి గ్రామం లో గురువారం రాత్రి ఓ బిచ్చగాడు చనిపోయాడు.

అతని వద్ద మూడు మూటలు ఉన్నాయి.వాటిని తెరిచి చూస్తే నోట్ల కట్టలు ఉన్నాయి.

రాత్రి లెక్కింపు పూర్తి కాలేదు.దీంతో ఆ మూటలకు మధ్యవర్తుల సమక్షంలో సీల్ వేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అయితే ఆ వ్యక్తి బిక్షగాడు కాదు.హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే సాధుపుంగవుడు.

ఎక్కడినుండి వచ్చాడో తెలియదు.ఎవరూ లేని జీవి.

హిందూ ధర్మం గురించి ప్రచారం చేసే వారు.చిన్న పిల్లలకు బాలారిష్టాలు తొలగేందుకు రక్షరేకులు కట్టేవాడు.

అలా వచ్చిన డబ్బులు ఖర్చు చేసేవాడు కాదు.సంచిలో వేసుకునేవాడు.

దీంతో స్థానికులే అతని మృతదేహాన్ని ఖననం చేశారు.శుక్రవారం అధికారులందరికీ సమాచారం ఇచ్చి ఆ నోట్లు లెక్కిస్తామని అనంతరం అధికారుల ఆదేశాల మేరకు ఆ ధనాన్ని పరోపకారానికి ఉపయోగిస్తామని పోలీసులు చెబుతున్నారు.