బంపరాఫర్: ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లేకుండానే యూట్యూబ్‌లో ఫ్రీ వీడియోలు ..

ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లేకుండానే యూట్యూబ్‌లో ఫ్రీ వీడియోలు అందిస్తుంది.అదేంటి యూట్యూబ్ లో ఫ్రీ వీడియోలు అంటారా నిజమేనండి.

అసలు విషయం తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాపార దిగ్గజాలు లావాదేవీలపైనే దృష్టి పెట్టాయి.

అందులో యూట్యూబ్ కూడా ఒకటి.ఈ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ తన ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ముందుకు సాగుతుంది.

ఈ క్రమంలో ప్రీమియం సభ్యత్వానికి ఎక్కువమంది వినియోగదారులను తీసుకురావడానికి కొత్త మార్గాలను ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగానే ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రీమియం సభ్యుల కోసం ప్రత్యేకంగా 4K కంటెంట్‌ను రూపొందించే ట్రయల్ ని ప్రారంభించింది.

అయితే 4K ప్రయోగం గురించి ప్రేక్షకుల నుండి దీనిపై ప్రతికూల అభిప్రాయాలు వెలుపడ్డాయి.

అందువల్ల ఈ 4K ప్రయోగం నిలిపివేస్తున్నట్లుగా ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చింది.యూట్యూబ్ వీక్షించే చాలామంది వినియోగదారులు 4k ట్రయల్ ని అంగీకరించకపోవడం వల్ల ఈ 4k ట్రయల్ నిలిపివేయమని పేవాల్ లో యూట్యూబ్ ని అభ్యర్థించారు.

"""/"/ ఇకపోతే యూట్యూబ్ లో 4K క్వాలిటీ వీడియోలు చూడటానికి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండాలని వస్తున్న వార్తలపై యూట్యూబ్ స్పందించి ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కస్టమర్ కి ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చింది.

కాగా 4k ప్రయోగాన్ని పూర్తిగా విరమించుకున్నట్లు యూట్యూబ్ యాజమాన్యం ప్రకటించింది.ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండా 4K వీడియోలు చూసే సదుపాయాన్ని యూట్యూబ్ తన యూజర్లకు అందించింది.

సో, యూజర్లు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా 4K వీడియోలు యూట్యూబ్ లో చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.

కాకపోతే వారు యాడ్స్ చూడాల్సి వస్తుంది.అలాగే హై క్వాలిటీ వీడియోలను వారు డౌన్‌లోడ్ చేసుకోలేరు.

నదిలో పడిపోయిన యజమాని.. నది ఒడ్డునే 4-రోజులు వెయిట్ చేసిన కుక్క.. ఎక్కడంటే..?