ఓటీటీ లో ‘బ్రో ది అవతార్’ కి బంపర్ రెస్పాన్స్.. ఒక్కరోజులో ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలుసా!
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'బ్రో ది అవతార్' ( Bro The Avatar )రీసెంట్ గానే గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగ్గట్టుగా సినిమా లేకపోవడం ఒక్క పాట, ఫైట్ లేకుండా తీసిన సినిమా అవ్వడం తో ఆడియన్స్ ఫ్యాన్స్ ఈ చిత్రానికి కనెక్ట్ కాలేకపోయారు.
కానీ ఫామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా సినిమా ఉండడం తో ఫుల్ రన్ లో 70 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయి.
'అత్తారింటికి దారేది' చిత్రం ( Attarintiki Daredi )తర్వాత పవన్ కళ్యాణ్ కి 'వకీల్ సాబ్' మరియు 'బ్రో ది అవతార్' చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చాయి.
కానీ పవన్ కళ్యాణ్ రేంజ్ సినిమా కాదు అంతే, అందులో ఎలాంటి సందేహం లేదు.
"""/" /
ఇకపోతే ఈ చిత్రాన్ని రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసారు.
నెట్ ఫ్లిక్స్ లో కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ యూత్ ఆడియన్స్ నుండి వచ్చింది.
ఇంత డల్ గా సినిమా ఉందేంటి, దీనిని పవన్ కళ్యాణ్ కాకుండా వేరే హీరో చేసుంటే అసలు 30 కోట్లు కూడా రాబట్టి ఉండేవి కాదు అంటూ పోస్టులు వేశారు.
కానీ మధ్య వయస్సు ఉన్న వారికి , అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా నచ్చింది.
పవన్ కళ్యాణ్ గత చిత్రం 'భీమ్లా నాయక్( Bheemla Nayak )' కంటే 'బ్రో ది అవతార్' చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాని తొలి 24 గంటల్లో 70 మిలియన్ వాచ్ మినిట్స్ వచ్చాయట.
ఈ రేంజ్ వ్యూస్ రీసెంట్ సమయం లో ఏ పెద్ద మూవీ కి కూడా రాలేదు.
"""/" /
'ఆదిపురుష్' చిత్రానికి కూడా మొదటి 24 గంటల్లో కేవలం 50 మిలియన్ వాచ్ మినిట్స్ మాత్రమే వచ్చాయి.
మరి ఇదే రేంజ్ ట్రెండ్ ని కొనసాగిస్తూ ఒక రెండు వారల పాటు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ 1 స్థానం లో ట్రెండ్ అయితే కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యినట్టే అని చెప్పొచ్చు.
అలాగే టీవీ టెలికాస్ట్ లో కూడా ఈ సినిమాకి డీసెంట్ స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తాయని అంటున్నారు, చూడాలి మరి.
ఇకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం 'ఓజీ' మూవీ టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే, ఈ టీజర్ సెప్టెంబర్ 2 వ తారీఖున విడుదల కోబోతుంది.
అరగుండు తారక్ తో ఏం ప్లాన్ చేశావ్ సుకుమార్.. పుష్ప2 సరికొత్త రికార్డులు ఖాయమా?