బంపర్ ఆఫర్ . . వారందరికీ రెండేళ్లపాటు యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ..

ప్రస్తుత రోజులలో చిన్నపిల్ల వారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ ఫోన్ వినియోగం సర్వసాధారణం అయిపోయింది.

ఈ క్రమంలో రోజువారి డేటాను ఉపయోగించేవారు కూడా మరింత ఎక్కువ అయిపోయారు.అంతేకాకుండా అనవసర విషయాలలో కూడా స్మార్ట్ ఫోన్( Smart Phone ) వినియోగం వినియోగించి అనేక మందికి ఇబ్బందులు ఎదురు అయ్యేలాగా చేస్తున్నారు.

ఇక ఎక్కువగా యూట్యూబ్ లో వీక్షిస్తున్నప్పుడు యాడ్స్ వల్ల మనకి చికాకుగా ఉంటుంది.

ఈ క్రమంలో ఒకవేళ యూట్యూబ్ లో ఆడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ( Ad Free Experience On YouTube )చేయాలనుకుంటే కచ్చితంగా యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.

అయితే తాజాగా పోస్ట్ పెయిడ్, జియో ఎయిర్ ఫైబర్ కస్టమర్ల కోసం రెండేళ్ల పాటు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ను అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేసింది.

అంతేకాకుండా జియో సంస్థ ( Jio Company )భారతదేశ వ్యాప్తంగా సబ్స్క్రైబ్ ల కోసం డిజిటల్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడం కోసం ఈ ప్లాను ప్రవేశపెడుతున్నట్లు తెలియజేసింది.

ప్రస్తుతం ఈ బంపర్ ఆఫర్ కేవలం జియో 8 ఫైబర్, జియో ఫైబర్ పోస్ట్ పైడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని తెలియజేసింది.

"""/" / యాక్టివ్ ప్రీమియం యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ( YouTube Premium Subscription )యాక్టివేషన్ చేసుకోవడం ఎలా అన్న విషయానికి వస్తే.

ఈ కింద స్టెప్స్ ఫాలో అవుతే చాలు.ముందుగా పైన పేర్కొన్న ప్లాన్స్ ఏదో ఒక ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.

అనంతరం మై జియో యాప్‌లో మీ అకౌంట్ లో లాగిన్ అవ్వాలి.అక్కడ పేజీలో కనిపించే యూట్యూబ్ ప్రీమియమ్ బ్యానర్‌పై క్లిక్ చేయాలి.

అక్కడ మీ యూట్యూబ్ ఖాతాతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.అదే వివరాలతో జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ సెటప్ టాప్ బాక్స్‌లో లాగిన్ అయితే వెంటే యూట్యూబ్ యాడ్-ఫ్రీ కంటెంట్‌ను ఆశ్వాదించవచ్చు.

"""/" / అంతేకాకుండా.ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఎప్పుడైనా సరే ఆఫ్లైన్ వీడియోలను కూడా చాలా సులువుగా చూడవచ్చు.

ఇలా కేవలం వీడియోలు చూడడమే కాకుండా కంటెంట్ ఏదైనా వారికి నచ్చి ఉంటే డౌన్లోడ్ చేసుకొని వారు తీరిక సమయంలో చూసుకొనే అవకాశం కూడా కల్పించింది జియో.

ఇక ఇప్పటికే యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం ద్వారా 100 మిలియన్ల కంటే ఎక్కువ పాటలు యాడ్-ఫ్రీ లైబ్రరీ, వ్యక్తిగత ప్లేలిస్ట్‌లు, గ్లోబల్ చార్ట్-టాపర్ల లాంటి తదితర ఫ్యూచర్లను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.

ఒత్తిడిని చిత్తు చేసే ఆవు నెయ్యి.. ఎలా తీసుకోవాలో తెలుసా?