టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో తెగ బిజీగా మారింది.
తన గ్లామర్ తో ఎంతో మంది అభిమానుల హృదయాలను సంపాదించుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
ఇక ఇటీవలే కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది కాజల్.
"""/"/
పెళ్లి కంటే ముందు ఉన్న క్రేజ్ పెళ్లి తర్వాత కూడా రెట్టింపు అయిందని చెప్పవచ్చు.
గ్లామర్ విషయంలోనే కాకుండా వరుస అవకాశాలో కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
అంతేకాకుండా మరో వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది.ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాల పై కూడా బాగా ఆసక్తి చూపుతుంది కాజల్.
ఇదిలా ఉంటే తాజాగా మరో బంపర్ ఆఫర్ అందుకుంది ఈ బ్యూటీ.మొత్తానికి తన ఖాతాలో మరో ప్రాజెక్టు వచ్చి చేరింది.
తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా రీమేక్ లో నటించనుంది కాజల్.
లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఖైదీ.ఈ సినిమాలో కార్తీ కీలక పాత్రలో నటించగా వారి కెరీర్ లోనే మంచి సక్సెస్ లో నిలిచింది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్, పాటలు వంటివి లేకుండా థ్రిల్లింగ్ మూమెంట్ నేపథ్యంలో తెరకెక్కించారు.
"""/"/
ఇక ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారని తెలుస్తోంది.అందులో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించనున్నాడట.
ఇందులో కాజల్ హీరోయిన్ గా కనిపించనుందని తెలుస్తోంది.ఇక బాలీవుడ్ లో ఈ సినిమా కథలో మార్పులు ఉన్నట్లు తెలుస్తుంది.
లాక్‌డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.ఇక కాజల్ ఆచార్య లోనే కాకుండా, ఇండియన్ టూ, హే సినామికా, ఘోస్ట్లీ కబ్జా, ఇక నాగార్జున తో కూడా ఓ సినిమా చేయనుంది.
అతడు సినిమాకు మహేష్ ఫస్ట్ ఛాయిస్ కాదా… ఇన్నేళ్లకు బయటపెట్టిన మురళీమోహన్!