బంపర్ ఆఫర్: వారికి ఏకంగా అమెజాన్ ప్రైమ్ సభ్యత్వంపై 50% తగ్గింపు..!
TeluguStop.com
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అయిన అమెజాన్ తన కస్టమర్లకు ఒక శుభవార్తను అందించ నుంది.
అది ఏంటంటే ప్రైమ్ మెంబర్‌షిప్‌పై ఏకంగా 50 శాతం తగ్గింపును ప్రకటించనుంది.అయితే ఈ ఆఫర్ అనేది అందరికీ వర్తించదు.
కేవలం యూత్ కు మాత్రమే ఈ ఆఫర్ అందు బాటులో ఉంటుంది.యువతను ప్రధాన లక్ష్యంగా చేసుకుని అమెజాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ ఆఫర్ కేవలం 18-24 ఏళ్లలోపు యువకులకు మాత్రమే వర్తించనుంది.అంతే కాకుండా ఆ యువకులు కూడా పాత కస్టమర్లై ఉండాలి.
అమెజాన్ గత సంవత్సరం చివరి నెలలో ప్రైమ్ సేవల ధరలను పెంచిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఇప్పుడు యువతను లక్ష్యంగా చేసుకొని ప్రైమ్ మెంబర్‌షిప్‌పై 'యూత్ ఆఫర్' రెఫరల్స్ ప్రోగ్రాంను మొదలుపెట్టింది.
అంటే ఇందులో భాగంగా సదరు యూజరు ప్రైమ్‌లో చేరినట్లయితే వారి సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు రానుంది.
అలాగే ఈ యూత్ ఆఫర్‌లో భాగంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ నెలవారీ రూ.
179 సభ్యత్వంపై రూ.90 క్యాష్‌బ్యాక్‌తో లభించడంతో పాటు మరో రూ.
18 క్యాష్ బ్యాక్ కూడా రివార్డ్‌గా రావడం గమనార్హం.అలాగే రూ.
479 సభ్యత్వంపై రూ.230 క్యాష్‌బ్యాక్, మరో రూ.
46 క్యాష్‌బ్యాక్‌ను రిఫరల్ రివార్డ్‌గా ఆయా యూజర్ పొందవచ్చు.అలాగే రూ.
1,499 సభ్యత్వంపై 750 రుపాయిల క్యాష్‌బ్యాక్‌తో పాటుగా మరో వ్యక్తికి రెఫరల్ చేసినందుకుగాను మరో రూ.
150 క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్ అంది స్తోంది.రిఫర్ చేసిన వ్యక్తి కూడా యువకుడు అయ్యే ఉండాలి.
ఇందుకు రిఫర్ చేసిన యూజర్ తన వయసును నిర్దారించే ధ్రువ పత్రాలతో పాటు అతని సెల్ఫీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
అప్పుడే క్యాష్‌బ్యాక్ అనేది మీకు వస్తుంది.
పుష్ప ది రూల్ మూవీ ఫైనల్ కలెక్షన్ల లెక్కలివే.. ఆ రికార్డ్ మాత్రం బ్రేక్ కాలేదుగా!