కుక్క కరిచిందని కోతికి వైద్యం చేశారు.. కానీ బుల్లెట్ చూసి షాకయ్యారు!

కుక్కలో దాడిలో ఓ కోతి తీవ్రంగా గాయపడింది.విషయం గుర్తించిన స్ఖానికులు దాన్ని వెటర్నరీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.

అయితే ఆ వైద్యులు కూడా కోతికి వైద్యం చేయడం ప్రారంభించారు.కానీ దాని భుజంలో బుల్లెట్ కనిపించడంతో అవాక్కయ్యారు.

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా చెరుకువాడలో ఈ ఘటన చోటు చేసుకుంది.అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పశ్చిమ గోదావరి జిల్లా చెరుకు వాడలో ఒక కోతిపై కుక్కలు దాడి చేశాయి.

ఈ దాడిలో వానరం తీవ్రంగా గాయపడింది.అయితే ఈ విషయం గమనించిన కొందరు జంతు ప్రేమికులు దాన్ని ప్రైవేటు పశు వైద్యశాలకి తరలించారు.

అయితే వైద్యులు వానరానికి చికిత్స చేస్తున్న సమయంలో డాక్టర్ సాయితేజ.కోతి భుజంలో బుల్లెట్ ఉండడం గమనించాడు.

వెంటనే వానర శరీరం నుంచి తూటాను తొలగించి చికిత్స అందించారు.అయితే సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు తూటాను పరిశీలించారు.ఇది బుల్లెట్ కాదని ఆక్వా చెరువుల వద్ద పక్షుల్ని కొట్టడానికి ఉపయోగించే ఫిల్లెట్ అని నిర్ధారించారు.

అయితే ఈ వార్త కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.కుక్క కరిచిందంటూ వైద్యులు కోతికి చికిత్స చేస్తున్న సమయంలో కనిపించిన బుల్లెట్.

తూటా కాదని అది ఫిల్లెట్ అని వివరణ ఇస్తూ కనిపిస్తోంది.స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి ఏం జరిగినా వెంటనే వైరల్ అయిపోతున్నాయి.

వీధిలో యోగాతో అదరగొట్టిన యువకుడు.. రామ్‌దేవ్ బాబాని మించిపోతున్నాడే..?