వీడియో: కొమ్ములు తిరిగిన ఎద్దుతో పెట్టుకున్న అవ్వ.. అది కుమ్మేయడంతో..

ఈరోజుల్లో గేదెలు, ఆవుల దాడులు చాలా ఎక్కువైపోతున్నాయి.వీటికి సంబంధించిన సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి.

తాజాగా అలాంటి మరో భయంకరమైన వీడియో ట్విట్టర్ లో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో ఒక అవ్వను( Elderly Woman ) ఒక ఎద్దు కుమ్ములతో పొడుస్తూ ఎత్తి కుదేసింది.

ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.ఈ వీడియోను 'సెకండ్ బిఫోర్ డిజాస్టర్' అనే ట్విట్టర్ అకౌంట్ షేర్ చేసింది.

ఈ సంఘటన చూసి చాలా మంది నెటిజన్లు అయ్యో పాపం అంటున్నారు. """/" / వీడియో కనిపించినట్లుగా ఒక రోజు ఒక ముసలావిడ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు.

అదే రోడ్డుపైకి ఒక పెద్ద, కొమ్ములు తిరిగిన నల్ల ఎద్దు( Black Ox ) వచ్చింది.

ఆ ఎద్దు తన వైపు వస్తున్నందుకు భయపడి ఆ అమ్మమ్మ తన దగ్గర ఉన్న కర్రతో( Stick ) ఎద్దును పక్కకు వెళ్లేలా కర్రతో చిన్నగా కొట్టింది.

కానీ ఎద్దుకు కోపం వచ్చి ఆ అవ్వను తన కొమ్ములతో ఎత్తేసి నేలమీద పడవేసింది.

ఈ భయంకరమైన దృశ్యాన్ని రోడ్డు దగ్గర ఉన్న సీసీ కెమెరా రికార్డు చేసింది.

ఈ వీడియోలో ఎద్దు చాలా కోపంగా ఉండటం, దాని కోపానికి ఆ అవ్వ బలైపోవడం కనిపించాయి.

"""/" / ఆ అవ్వ ఈ దాడిలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.సమీపంలో ఉన్న కొందరు ఈ దాడి జరిగిన వెంటనే రియాక్ట్ అయ్యారు.

ఆ ఎద్దును భయపెట్టడంతో అది అక్కడినుంచి వెళ్లిపోయింది.సెప్టెంబర్ 2న ఇంటర్నెట్‌లో పోస్ట్ అయిన ఈ వీడియోకు కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 10 లక్షల వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియో చూశారు.ఈ వీడియోని చూసిన వాళ్లందరూ అవ్వకు ఇలా జరిగి ఉండకూడదు అని కామెంట్లు చేస్తున్నారు.

కొంతమంది ఆ అవ్వ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.మరికొంతమంది ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం అని అన్నారు.

దీన్ని మీరూ చూసేయండి.

వామ్మో.. కూల్ డ్రింక్స్ తాగ‌డం వ‌ల్ల ఇన్ని జ‌బ్బులా..?