విజయసాయి రెడ్డి గారు.. మీరు చంద్రబాబుకు చాల మేలు చేస్తున్నారండి!

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ వేడి ఎప్పుడు ఉండేదే.కానీ ఇప్పుడు ఆ వేడి ట్విట్టర్ కు కూడా సోకింది.

అందుకే ఎప్పుడు చూడు ట్విట్టర్ వేధికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు.

ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ వేధికగా ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకున్నారు.ట్విట్టర్ వేధికగా విజయసాయి రెడ్డికు కృతజ్ఞతలు చెప్పాడు బుద్ధా వెంకన్న.

అసలు ఏం జరిగిందంటే.వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేశారు.

అయితే ఆ విమర్శలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘాటుగా స్పందించారు.వీరిమధ్య సాధారణంగానే ట్విట్టర్ వార్ నడుస్తుంది.

అయితే ఈరోజు అదికాస్తా ఎక్కువ అయ్యింది.ఆ వార్ అంత కూడా కియా మోటర్స్ పైనే జరిగింది.

"""/"/విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.''ఎంత పెద్ద అబద్ధమైనా రాయిస్తాడు చంద్రబాబు.

అన్నింటికి తెగబడి పోయాడు.ఎల్లో మీడియా వార్తలు ప్రజలు నమ్మడం లేదని రాయిటర్ ఏజెన్సీ పేరుతో కియా వెళ్లిపోతుందని అభూత కల్పన సృష్టించాడు.

ప్రజా క్షేత్రంలో తేల్చుకునే దమ్ములేక ఇలాంటి పిరికిపంద పనులకు పాల్పడుతున్నాడు.'' అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి.

ఈ ట్విట్ పై స్పందించిన బుద్ధా వెంకన్న సెటైర్లు వేశాడు.చంద్రబాబుగారికి రూపాయి ఖర్చు లేకుండా రాయిటర్స్ లాంటి ప్రతిష్టాత్మక న్యూస్ ఏజెన్సీలను కూడా యెల్లో మీడియా అని, ఆయన ఎలా చెబితే అలా ఆడతాయని చెప్పి ఎంతో మేలు చేస్తున్న విజయసాయి రెడ్డి గారికి ధన్యవాదాలు.

వైఎస్ గారి తుగ్లక్ నిర్ణయాలు, మీ సైకో నిర్ణయాలు చూసి రాష్ట్ర మీడియా దగ్గర నుండి జాతీయ మీడియా వరకూ జగన్ గారిని తుగ్లక్ గా అభివర్ణిస్తూ రఫ్ఫాడిస్తున్నాయి.

అవన్నీ యెల్లో మీడియా అని మాకు అప్పజెప్పాలి అనుకుంటే మరీ సంతోషం విజయసాయి రెడ్డిగారు.

'' అంటూ ట్విట్ చేశాడు బుద్ధా వెంకన్న.దీంతో ఈ ట్విట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైసీపీ టీడీపీ అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తుంది ఈ ట్విట్ల కారణంగా.

నాకు రాజకీయాలు తెలియవు.. ‘మా’ని నేను కోరేది అదొక్కటే.. పూనమ్ కామెంట్స్ వైరల్!