Harish Rao : అన్నదాతలను ఆగం చేసేలా బడ్జెట్..: హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై మాజీ మంత్రి హరీశ్ రావు( Former Minister Harish Rao ) స్పందించారు.

కొండంత ఆశలు పెట్టి గోరంత కూడా చేయలేని బడ్జెట్ ఇదని విమర్శించారు.అన్నదాతలను ఆగం చేసేలా బడ్జెట్ ఉందన్నారు.

రైతులకు నామమాత్రంగా కేటాయింపులు చేశారని మండిపడ్డారు.రైతుబంధు, రుణమాఫీకి రాంరాం చెప్పేలా బడ్జెట్ పెట్టారని పేర్కొన్నారు.

వ్యవసాయ రంగానికి సంబంధించి రూ.87 వేల కోట్లు అవసరమన్న హరీశ్ రావు బడ్జెట్ లో పెట్టింది రూ.

19,746 కోట్లని తెలిపారు. """/" / ఈ నిధులు ఎక్కడా సరిపోవన్నారు.

రైతులను దగా చేశారన్న హరీశ్ రావు రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని పేర్కొన్నారు.

ప్రజా పాలన, 24 గంటల కరెంట్ పై అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు.ప్రస్తుతం ఎక్కడా కూడా 14 లేదా 15 గంటలకు మించి కరెంట్ రావడం లేదన్నారు.

కేసీఆర్ రైతులను రాజులను చేస్తే కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.

కొండ సురేఖ వివాదం .. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి విన్నపం