బడ్జెట్ లెక్కలు వాస్తవాలకు దగ్గరగా లేవు.. సీఎల్పీ నేత భట్టి

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లెక్కలు వాస్తవాలకు దగ్గరగా లేవని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం కూరుకుపోయిందని తెలిపారు.

తలసరి ఆదాయం పెరిగిందని చెబుతున్నారన్న భట్టి అదెవరికి పెరిగిందని అడిగారు.ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు.ఈడీ, సీబీఐతో కేంద్రం వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ లేదన్నారు.దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని స్పష్టం చేశారు.

సీరియల్స్ సంపాదన చీరలకే సరిపోతుంది.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!