Viral Video : వీడియో: ట్రిపుల్ రైడింగ్ చేస్తూ రోడ్డుపై హల్చల్ చేసిన బుడ్డోళ్ళు.. చెంప పగలగొట్టించుకున్నారు!

ఇండియాలో మైనర్స్‌( Minors In India ) బిజీ రోడ్ల మీద డ్రైవింగ్ చేయడం చాలా కామన్.

ట్రాఫిక్ లో డ్రైవ్ చేయాలంటే అనుభవం, బండిని కంట్రోల్ చేసే సామర్థ్యం ఉండాలి.

పిల్లలలో ఇవి రెండూ లోపిస్తాయి.అంతేకాదు, చిన్న వయసులో వేగంగా దూసుకెళ్లాలని ఉంటుంది.

దీనివల్ల వారికే కాకుండా ఇతరులకు కూడా ప్రాణహాని ఉంటుంది.ఇన్ని రిస్కులు ఉన్నా తక్కువ వయస్సు గల పిల్లలు డ్రైవింగ్ చేస్తూనే ఉన్నారు.

ఇది వాహనదారుల్లో ఆందోళనకు దారి తీస్తోంది.అధికారులు, ట్రాఫిక్ పోలీసులు రహదారి భద్రతా నియమాలకు కట్టుబడి ఉండాలని నొక్కి చెబుతూనే ఉన్నారు, అయితే ఈ హెచ్చరికలను పిల్లలు పట్టించుకోవడం లేదు.

తాజాగా ముగ్గురు మైనర్లు స్కూటర్‌ను నడుపుతూ నిర్లక్ష్యంగా ప్రవర్తించారు.వారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

వైరల్‌ వీడియోలో రద్దీగా ఉండే రోడ్డుపై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ పిల్లలు కనిపించారు.

వారు ట్రాఫిక్‌లో వేగంగా దూసుకెళ్లడం కనిపించింది.అది చూసి ఇతర వాహనదారులు కంగారు పడ్డారు.

ఈ పిల్లలు చాలా ర్యాష్ గా స్కూటర్ రైడ్ చేశారు.ఒక రైడర్ తృటిలో వీరిని ఢీ కొట్టే ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు, ఇది పరిస్థితి ప్రమాదాన్ని హైలైట్ చేస్తుంది.

"""/" / స్పష్టమైన ప్రమాదం ఉన్నప్పటికీ, మైనర్లు ఏం జరగదు అన్నట్లు కనిపిస్తారు, వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు.

అయితే, వారు మరొక రైడర్‌ను కూడా ఢీ కొట్టబోయారు.దాంతో ఆ ఇతర మోటారిస్ట్ కోప్పడి ఈ బుడ్డ రైడర్‌లను( Budda Riders ) పట్టుకున్నాడు.

అప్పుడు ఇద్దరు మైనర్లు సంఘటనా స్థలం నుంచి పారిపోయారు, స్కూటర్ నడుపుతున్న పిల్లోడు మాత్రం ఒంటరిగా పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఒక పెద్ద వయసు వాహనదారుడు ఈ పిల్లోడిని చెంపదెబ్బ కొట్టి మందలించాడు.ఇది పిల్లల ఆట అనుకుంటున్నారా అని తిట్టడం, రోడ్లపై ఎందుకు రైడ్ చేస్తున్నావ్ అని ప్రశ్నించడం కూడా జరిగిపోయాయి.

"""/" / ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫన్నీ క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు.కొంతమంది నెటిజన్లు పిల్లోడిని కొట్టడం ఏం బాగోలేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు, తల్లిదండ్రులు లేదా అధికారులకు తెలియజేయడం మరింత సరైన పని అని అన్నారు.

మరికొందరు ఆ పిల్లలు తమ స్నేహితుడిని ఒంటరిగా వదిలివేసి పారిపోవడం గురించి ఫన్నీగా కామెంట్లు చేశారు.

ఈ వీడియోకు 70 లక్షల దాక వ్యూస్, 4 లక్షల లైక్‌లు వచ్చాయి.

దీన్ని మీరు కూడా చూసేయండి.

ఇండియాకి, అమెరికాకి మధ్య 10 తేడాలు చెప్పిన ఐఐటీ కపుల్.. ఏంటంటే?