జనసేన ను భయపెడుతున్న ‘ బకెట్ ‘ !
TeluguStop.com
తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో ఏపీలో కచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమాతో జనసేన పార్టీ ( JanaSena Party )ఉంది.
ఇక ఏపీ కంటే ముందుగా జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము పోటీ చేస్తున్నామని ఇటీవలే జనసేన నుంచి ప్రకటన వెలువడింది.
దీంతో తెలంగాణ రాజకీయాల్లో జనసేన ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉన్న పవన్ ఏ ధైర్యంతో ఎన్నికలకు వెళ్తున్నారనే విషయం చాలామందికి అర్థం కాలేదు .
ఇది ఇలా ఉంటే.కొంతకాలం క్రితం కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును రద్దు చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు ప్రకారం ఆ గుర్తును తొలగించింది. """/" /
దీంతో కేవలం రిజిస్టర్ పార్టీగా మాత్రమే జనసేన( JanaSena Party ) ఉంది.
జనసేన గుర్తు అయిన గాజు గ్లాసు సింబల్ ను ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చింది .
అయితే కొద్ది రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించింది.
దీంతో జనసేన లో కొత్త ఉత్సాహం కనిపించింది.మళ్ళీ జనసేనకు గాజు గ్లాసు గుర్తు ను కేటాయించడంతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు, దీనికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ పవన్( Pavan Kalyan ) ట్వీట్ చేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయబోతున్న జనసేనకు మరోసారి గుర్తు టెన్షన్ మొదలైంది.
జనసేన తెలంగాణలో పోటీ చేయబోయే 32 స్థానాలలో గాజు గ్లాస్ గుర్తును ఆ పార్టీకి ఈసీ కేటాయించింది .
"""/" /
మిగిలిన చోట్ల ఆ సింబల్ ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థులు కోరుకుంటే వారికి కేటాయించనుంది .
అయితే ఇదే సమయంలో జాతీయ జనసేన పేరుతో మరో పార్టీ ఎంట్రీ ఇచ్చింది.
ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తును కేటాయించింది.ఇది దాదాపు జనసేన గుర్తు అయిన గాజు గ్లాసును పోలి ఉండడం , పార్టీ పేరు కూడా జనసేన కలిసి ఉండటంతో జనసేన పార్టీలో కొత్త టెన్షన్ మొదలైంది.
తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోటీ చేసేందుకు జాతీయ జనసేన పార్టీ కి ఈసీ బకెట్ గుర్తును కేటాయించింది.
దీంతో జనసేనలో ఆందోళన మొదలైంది.ఈ బకెట్ గుర్తు జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును పోలి ఉండడంతో పాటు, పార్టీ పేరు జనసేన ( JanaSena Party )తలపించేలా ఉండడంతో కచ్చితంగా జనసేనకు ఓటు వేయాలనుకున్నవారు కన్ఫ్యూజ్ అవుతారని , దీనివల్ల జనసేనకు జరిగిన నష్టం ఎక్కువగా ఉంటుందనే ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తోంది.
తెలంగాణలో జనసేనకు పెద్దగా బలం లేకపోవడంతో అక్కడ పెద్దగా ఇబ్బంది ఎదురు కాకపోయినా, జాతీయ జనసేన పార్టీ ఏపీ ఎన్నికల్లో పోటీకి దిగితే అక్కడ కూడా ఇదే బకెట్ గుర్తుతో ఎన్నికలకు వస్తే జనసేనకు జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందనే జనసేన ఆందోళన చెందుతుంది.
ఈ సింపుల్ చిట్కాలతో డార్క్ నెక్‌కు చెప్పేయండి గుడ్ బై!