మాజీ ఎంపీటీసీ,బీజేపి నాయకుడి చొరవతో ఇంటికి చేరిన బుచ్చి ఎల్లయ్య.
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము నకు చెందిన బుచ్చి ఎల్లయ్య అనే మతి స్థిమితం సరిగా లేని వ్యక్తి గత మూడు రోజుల క్రితం తప్పిపోయి కొనరావుపేట మండలంలోని నిమ్మపల్లి పక్కన గల గొల్లపల్లె లో ఉండగా ఇట్టి విషయం అక్కడి గ్రామస్థులు ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu Balaraju Yadav ) కు, బీజేపి జిల్లా నాయకులు మానుక రాజు యాదవ్ ల దృష్టికి తీసుకెళ్లగా ఇట్టి విషయాన్ని బుచ్చి ఎల్లయ్య భార్య భాగ్య కు సమాచారం అందించారు.
వెంటనే అతడి భార్య భాగ్య గొల్లపల్లె కు వెళ్లి ఎల్లారెడ్డి పేట లోని స్వగృహానికి తీసుకువచ్చారు.
తప్పిపోయిన బుచ్చి ఎల్లయ్య క్షేమంగా ఇంటికి చేర్చడానికి ప్రయత్నించిన ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ కు,బీజేపి జిల్లా నాయకులు మానుక రాజు యాదవ్ కు బుచ్చి ఎల్లయ్య( Buchi Ellaiah ) కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు.
ఇంటికి చేరిన బుచ్చి ఎల్లయ్య ను ఒగ్గు బాలరాజు యాదవ్ పరామర్శించారు.
మహేష్ జక్కన్న మూవీ ముహూర్తం ఫిక్స్.. ఆరోజు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే!