ఆ డైరెక్టర్ తో బన్నీ గుసగుసలు.. సినిమా ఫిక్స్ అయ్యేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.ఇప్పటికే వరుస సినిమాలలో తెలుగు బిజీగా ఉన్నాడు.

ఇటీవలె క్లాస్ నుండి మాస్ గా మారిన బన్నీ మొత్తానికి క్లాస్ సినిమాలను పక్కకు పెట్టేసాడట.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు బన్నీ.

ప్రస్తుతం కొరటాల ఎన్టీఆర్ తో ప్లాన్ చేయడం వల్ల బన్నీ సినిమా కు ఆలస్యం అయ్యేలా ఉంది.

గతంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుపగా మళ్లీ ఎటువంటి ప్రకటన లేదు.

ఇక ఇదిలా ఉంటే బన్నీ మరో డైరెక్టర్ తో మరో ప్రాజెక్టు కోసం గుసగుసలాడుతున్నాడు.

"""/"/ ఇటీవలే బన్నీ మరో క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ ప్రాజెక్టు ఒప్పుకున్నట్లు తెలిసింది.

ఇటీవలే వీరిద్దరి మధ్య కథ గురించి చర్చలు కూడా జరిగాయట.ఇక తాజాగా మరో డైరెక్టర్ తో చేయనున్నట్లు తెలుస్తుంది.

మళ్లీ బన్నీ లిస్టులో మరో ప్రాజెక్టు వచ్చి చేరుతున్నట్లు తెలుస్తుంది.ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.

ఇటీవలే మంచి సక్సెస్ అందుకున్న ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సానా.ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందిన ఈయన తాజాగా బన్నీతో చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

"""/"/ ఇటీవలే బన్నీతో కనిపించిన బుచ్చిబాబు కథ గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది.వీరి కాంబినేషన్ లో మైత్రి మూవీస్ సంస్థ ఉందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే బుచ్చిబాబు ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నాడు.కానీ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉండటంతో అంతం లోపు బన్నీతో చేయాలని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామా ? తీవ్ర అసంతృప్తితో చంద్రబాబు ?