మెగా హీరోతోనే బుచ్చి బాబు..!
TeluguStop.com
మొదటి సినిమా ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరక్టర్ బుచ్చి బాబు తన నెక్స్ట్ సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు.
సెకండ్ సినిమా ఓ స్టార్ హీరోతో చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఇన్నాళ్లు వెయిట్ చేసిన బుచ్చి బాబు ఆ స్టార్ హీరో సినిమా ఎటు తేలకపోవడంతో మళ్లీ యువ హీరోతోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట.
ఉప్పెన తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.
ఆర్ తో సినిమా ప్లాన్ చేశాడు బుచ్చి బాబు.సుకుమార్ అసిస్టెంట్ గా చేసిన టైం లొ బుచ్చి బాబు, ఎన్.
టి.ఆర్ ఇద్దరు క్లోజ్ గా ఉన్నారు.
ఉప్పెన హిట్ పడటంతో వెంటనే ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నాడు.అయితే ఎన్.
టి.ఆర్ కొరటాల శివ సినిమా కన్ ఫర్మ్ అయ్యింది.
ఆ సినిమా ఇప్పటికే స్టార్ట్ అవ్వాల్సి ఉన్నా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారని టాక్.
ఒకానొక దశలో కొరటాల శివని కాదని బుచ్చి బాబుతోనే తారక్ సినిమా చేయాలని అనుకున్నాడట.
కానీ మళ్లీ ప్లాన్ ఛేంజ్ చేశాడు.ఫైనల్ గా బుచ్చి బాబు మళ్లీ తిరిగి మెగా హీరోతోనే సినిమా చేయాలని చూస్తున్నాడట.
కుదిరితే ఈసారి సాయి ధరం తేజ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట.అతను అందుబాటులో లేకపోతే ఉప్పెన హీరో వైష్ణవ్ తోనే మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
పవన్ కళ్యాణ్ మూవీ మళ్లీ వాయిదా పడిందా.. రాబిన్ హుడ్ డేట్ వెనుక రీజన్ ఇదేనా?